బెంట్లీ డ్రైవర్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!.. ఏం చేసాడో తెలుసా (వీడియో)
ఖరీదైన కార్లను డ్రైవ్ చేసేవారికి ఎక్కువ అహంకారం ఉంటుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది అబద్దం అని ఓ వ్యక్తి ఒక్క సంఘటనలో నిరూపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఖరీదైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT) కారు డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు పెద్దవాళ్లు రోడ్డు దాటుతున్నారు. బెంట్లీ కారు రావడంతో వారు అక్కడే ఆగిపోయారు. కానీ ఆ కారులోని వ్యక్తి కారును అక్కడే ఆపి.. ముందుకు వెళ్ళండి అన్నట్లు చెప్పారు. ఆ తరువాత ఆ ఇద్దరు రోడ్డు దాటి వెళ్లిపోయారు.

కేవలం చిన్న వీడియో అయినా పెద్ద సందేశాన్ని ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. బెంట్లీ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని తెగ ప్రశంసిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటిన తరువాత బెంట్లీ కారు ముందుకు వెళ్లిపోవడం చూడవచ్చు. ఖరీదైన కార్లు కలిగి ఉన్న వారు కూడా మంచి మనసు కలిగి ఉంటారని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT)
గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో బెంట్లీ కాంటినెంటల్ జీటీ కూడా ఒకటి. బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ కంపెనీ యొక్క ఈ కాంటినెంటల్ జీటీ ప్రారంభ ధర రూ. 5.23 కోట్లు.. కాగా వీ12 ఇంజిన్ కలిగిన మోడల్ ధర రూ. 8.45 లక్షలు. వీడియోలో కనిపిస్తున్న కారు మూడవ జనరేషన్ అని తెలుస్తోంది. ఇది మొరాకన్ బ్లూ కలర్ కలిగి చూడచక్కగా ఉంది.

ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 542 Bhp పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ జెడ్ఎఫ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. నిజానికి ఇలాంటి ఖరీదైన కార్లను కేవలం ధనవంతులు, సెలబ్రిటీలు మరియు ఇతర ప్రముఖులు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు.
భారతదేశంలో బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారాలను కలిగి ఉన్న వారిలో ఒకరు అనంత్ అంబానీ, మరొకరు యువరాజ్ సింగ్ ఉన్నారు. గత ఏడాది అనంత్ అంబానీకి తన తండ్రి ముకేశ్ అంబానీ బెంట్లీ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఇది కన్వర్టిబుల్ మోడల్ మరియు నారింజ రంగంలో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని ధర రూ. 5.9 కోట్లు అని తెలుస్తోంది.

అనంత్ అంబానీ బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ కారు 6.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ డబ్ల్యు12 ఇంజిన్ పొందుతుంది. ఇది 659 పీఎస్ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కూడా మంచి డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
యువరాజ్ సింగ్ గ్యారేజిలో బెంట్లీ కాంటినెంటల్ జీటీ దుబాయ్‌లో కొనుగోలు చేసి భారదేశానికి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఏజియన్ బ్లూ కలర్ కూపే బెంట్లీ కాంటినెంటల్ జీటీ కలిగి ఉన్నారు. దీని ధర ఎంతో స్పష్టంగా తెలియదు, కానీ ఇది ఇండియన్ నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. ఈయన వద్ద బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కూడా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








