ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్
కార్లను అమ్మడం అంటే ఆషామాషీ పని కాదు. అందులోనూ కోట్ల ఖరీదు చేసే కార్లను విక్రయించడమంటే, దానికి ఎంతో నైపుణ్యం వాక్చాతుర్యం, మార్కెటింగ్ తెలివితేటలు కావాలి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న సేల్స్ఉమెన్‌ను చూడండి. ఈమె ఇప్పుడు ప్రపంచంలోనే ఉత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్‌గా నిలిచింది. కార్లను విక్రయించడంలో ఈమె బెస్ట్ సేల్స్ఉమెన్ అనిపించుకుంది.
ఈమె పేరు అనిటా క్రిజ్సాన్. ఇంతకీ ఈమె విక్రయించిందేంటో తెల్సా.. సంవత్సరంలో కేవలం 10 కార్లు మాత్రమే. ఏంటి పది కార్లు విక్రయించినందుకే బెస్ట్ సేల్స్ఉమెన్ అవార్డ్ ఇచ్చారా అనుకోకండి. ఆమె విక్రయించింది టాటా నానో కార్లు కాదు, ప్రపంచంలో కెల్లా ఖరీదైన కార్లలో ఒకటైన బుగాటి వేరాన్ కార్లను ఒక్క సంవత్సరంలో 10 యూనిట్లు విక్రయించింది.
హంగేరీకు చెందిన అనిటా క్రిజ్సాన్ లండన్‌లోని జాక్ బార్క్లే వద్ద ఉన్న మేఫెయిర్ అనే బుగాటి డీలర్‌షిప్‌లో కేవలం 12 నెలలో సమయంలోనే మొత్తం 10 బుగాటి వేరాన్ కార్లను విక్రయించింది. వీటి విలువ సుమారు 120 లక్షల బ్రిటీష్ పౌండ్లు. ఇందుకు గాను బుగాటి సంస్థ యజమాని ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకున్నారు.
సాధారణ సేల్స్‌మెన్ సగటున ఏడాది 3 కంటే ఎక్కువ బుగాటి వేరాన్ కార్లను విక్రయించలేడు. కానీ అనిటా క్రిజ్సాన్ మాత్రం ఒక్క ఏడాదిలో 10 కార్లను విక్రయించి ఔరా అనిపించుకుంది. ఇందుకు ఆమె నైపుణ్యాలు, విఐపి కస్టమర్లతో సత్సంబంధాలు కలిగి ఉండటమే ప్రధాన కారణం. దీనికితోడు సదరు షోరూమ్ కూడా లండన్‌కు నడిబొడ్డున ఉండటం మరొక అడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు.

ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్

ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్

ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్

ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్

ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్

ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఆటోమొబైల్ సేల్స్ఉమెన్

Click it and Unblock the Notifications