ఇంపోర్ట్‌ఫెస్ట్ 2013లో మెరిసిన కార్స్ అండ్ గర్ల్స్
కార్లను తమ నచ్చిన విధంగా ట్యూన్ చేసుకోవటం చాలా మందికి క్రేజ్. ఈ క్రేజీయుల కోసమే కెనడాలో ఓ పండుగ నిర్వహిస్తారు. 'ఇంపోర్ట్‌ఫెస్ట్' (ImportFest)గా పిలిచే ఈ పండుగలో అందమైన కార్లు, హాట్ హాట్ మోడల్ గర్ల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కెనడాలో ప్రతి ఏటా ఇంపోర్ట్‌ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించిన ఇంపోర్ట్‌ఫెస్ట్ 2013లో బెస్ట్ ఇంపోర్ట్ ట్యూనర్ కార్లను, హాట్ మోడళ్లను చూడొచ్చు. నార్త్ అమెరికాలో అతిపెద్ద కార్ ఈవెంట్లలో ఈ కార్యక్రమం కూడా ఒకటిగా గుర్తించబడింది.
ఇంపోర్ట్ ట్యూనర్ కార్యక్రమాలు ఎక్కువగా జపనీస్ ట్యూనర్ కార్లకు ప్రసిద్ధి చెందినవి, అయితే ఈ కెనడియన్ షోలో జపనీస్ కార్లతో పాటుగా వివిధ రకాల ఇటాలియన్ సూపర్ కార్లను కూడా గమనించవచ్చు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ మార్కెల్ లీచ్ ఈ అందాలను మన ముందుకు తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో నిస్సాన్ 370జెడ్, అరాన్సియో అట్లాస్ లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి700-4, లెక్సస్ ఎల్ఎఫ్ఏ, స్కియన్ ఎఫ్ఆర్-ఎస్, నిస్సాన్ జిటి-ఆర్, ఆడి ఆర్8, బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 వంటి కార్లను అందంగా ట్యూన్ చేశారు. ఇటీవలే ముగిసిన ఈ ఇంపోర్ట్‌ఫెస్ట్ 2013 ఫొటోలను ఈ కథనంలో పరిశీలిద్దాం రండి.















































Click it and Unblock the Notifications








