ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

కొత్త కారు కానీ లేదా పాత కారు కానీ కస్టమర్లు తమ అభిరుచికి తగినట్లుగా వాటిని కస్టమైజ్ చేసుకునేందుకు చాలా ఆసక్తి చూపుతుంటారు. కొందరైతే ఖర్చు తక్కువ అవుతుందని బేస్ వేరియంట్లను కొనుగోలు చేసి, ఆఫ్టర్ మార్కెట్లో లభించే పరికరాలతో వాటిని టాప్-ఎండ్ వేరియంట్లుగా మార్చుకుంటుంటారు. కానీ, ఇలా చేసే మోడిఫికేషన్ల వలన ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణే ఈ సంఘటన, అదేంటో చూద్దాం రండి.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

ఆఫ్టర్‌ మార్కెట్లో లభించే అల్లాయ్ వీల్స్‌ చూడటానికి చాలా అందంగా, స్టైలిష్ గా కనిపిస్తాయి. నిజానికి, ఇవి కార్ కంపెనీలు అందించే ఒరిజినల్ వీల్స్ కన్నా కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తాయి. అయితే, ఇక్కడే ప్రధానమైన చిక్కు ఉంది. తయారీదారులు వాడే అల్లాయ్ వీల్స్ బ్రాండెడ్ కంపెనీల నుండి గ్రహించబడుతాయి. కాబట్టి, ఇవి వివిధ రకాల క్వాలిటీ టెస్ట్ లను పాస్ అయి ఉంటాయి. అయితే, ఆఫ్టర్ మార్కెట్లో లభించే అల్లాయ్ వీల్స్ విషయంలో వాటి నాణ్యత మరియు మన్నికపై గ్యారంటీ ఉండదు.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్ ని ఉపయోగించడం వలన ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ ఫొటోలలో కనిపిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని చూడండి. లోకల్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించిన కారణంగా, కారు రోడ్డుపై ప్రయాణిస్తుండగా అందులో ఒక అల్లాయ్ వీల్ హఠాత్తుగా విరిగిపోయి, టొయోటా ఫార్చ్యూనర్ ఆరు చక్కర్లు కొట్టింది. ప్రమాదానికి గురైన టొయోటా ఫార్చ్యూనర్ తలకిందులుగా పడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

ఈ ఎస్‌యూవీని ఎంత స్పీడ్‌తో నడుపుతున్నారనే వివరాలు లేనప్పటికీ, ఇందులో ఉపయోగించిన నాలుగు ఆఫ్టర్ ‌మార్కెట్ అల్లాయ్ వీల్స్‌లో ఒకటి విరిగిపోవడం వల్ల క్రాష్ సంభవించిందని వీడియోలోని కథకుడు పేర్కొన్నాడు. విరిగిన చక్రం యొక్క విజువల్స్ చూస్తుంటే, వళ్లు గగుర్పొడవడం ఖాయం. పంజాబ్‌లోని హరి కే పటాన్ జిల్లాలో NH-703Bలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టొయోటా ఫార్చ్యూనర్ ఆరుసార్లు బోల్తా పడి చివరకు నిలిచిపోయిందని చెబుతున్నారు.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

ఈ కారులోని ఒక నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్ విరిగిపోవడం వల్ల ఇదంతా జరిగిందని తెలుస్తోంది మరియు డ్రైవర్ కూడా ఈ ఎస్‌యూవీని అధిక వేగంతో నడిపినట్లుగా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై అధికారిక దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉంది. అయితే, విజువల్స్‌ను బట్టి చూస్తే, ఇది నిజంగా అల్లాయ్ వీల్ విచ్ఛిన్నం కావడం వల్ల జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. తిరుగుతూ ఉండే అల్లాయ్ వీల్ రోడ్డుపై హఠాత్తుగా విరిగిపోవడంతో కారు రోడ్డుపై కంట్రోల్ తప్పి, ఆరుసార్లు బోల్తా పడింది.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

భారత ఆటోమోటివ్ రంగంలో ఆఫ్టర్ మార్కెట్ పరికాల విభాగం చాలా పెద్దది. ఈ విభాగంలో మనదేశంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు మరియు అనుబంధ దుకాణాలు ఈ వ్యాపారంలో ఉన్నాయి. వీటిలో అతికొద్ది కంపెనీలు మాత్రమే అధిక-నాణ్యత గల భాగాలను విక్రయిస్తున్నప్పటికీ, చాలా వరకు కంపెనీలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఉండే ఈ ఆఫ్టర్‌మార్కెట్ దుకాణాలు మరియు వాటి నుండి కొనుగోలు చేసే వారు ఇలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

ఇలాంటి నాన్-బ్రాండెడ్ ఆఫ్టర్ మార్కెట్ పరికరాలను విక్రయించే అనుబంధ దుకాణాలు, నిజమైన దుకాణాల (ఒరిజినల్ బ్రాండెడ్ యాక్ససరీలను అందించే కంపెనీల) కంటే చాలా తక్కువ ధరకే విడిభాగాలను విక్రయిస్తుంటాయి. కాబట్టి, కొనుగోలుదారులు కూడా ధర తక్కువగా ఉండటంతో ఇలాంటి నాన్-బ్రాండెడ్ యాక్ససరీలనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ తమ కార్లు లేదా మోటార్‌సైకిళ్లను కస్టమైజ్ చేయాలనుకుంటడంతో మార్కెట్లో ఇలాంటి వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

మార్కెట్లో అత్యంత డిమాండ్ తో కూడుకున్న మోడిఫికేషన్లలో ఒకటి ఆఫ్టర్ మార్కెట్ అప్‌సైజ్డ్ వీల్స్ మరియు టైర్లు. అంటే, కస్టమర్లు తమ కార్లలో కంపెనీలు అందించే స్టాక్ వీల్స్ మరియు టైర్లను మార్చేసి వాటి స్థానంలో కొత్తగా పెద్ద వీల్స్ మరియు టైర్లను ఉపయోగిస్తుంటారు. హెవీగా మోడిఫై చేసిన పాత జీపులు మరియు ఆల్-వీల్ డ్రైవ్ వాహనాలలో ఇలాంటి పెద్ద టైర్లు మరియు వీల్స్ కనిపిస్తుంటాయి. ఇలాంటి వీల్స్ అండ్ టైర్ మోడిఫికేషన్స్ అన్ని సందర్భాల్లో సక్సెస్ కావు.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

నిజానికి, వాహనంలో నిర్దేశిత నిబంధనలకు మించి వీల్స్ మరియు టైర్లను అప్‌గ్రేడ్ చేయడం చట్టరీత్యా నేరం. ఇది వాహన మైలేజ్ మరియు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అన్‌బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్ ఒరిజినల్ బ్రాండెడ్ వాటి కంటే దాదాపు 70 శాతం వరకు చౌకగా ఉంటాయి. అయితే, ట్రేడ్-ఆఫ్ ఏమిటంటే, ఈ చక్రాల తయారీలో ఉపయోగించే మెటల్ నాణ్యతపై ఎటువంటి హామీ ఉండదు. ఒరిజినల్ తయారీదారులు అందించే చక్రాలు కఠినమైన పరీక్షలకు లోబడి ఉంటాయి.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

తయారీదారులు తమ వాహనాల బరువును లోడింగ్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చక్రాలను తయారు చేస్తారు. బయటి మార్కెట్లో లభించే కొన్ని బ్రాండెడ్ ఆఫ్టర్ మార్కెట్ అల్లాయ్ వీల్స్ వాహన తయారీదారులు నిర్ధేశించిన ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. అయితే, అనేక రకాల అన్‌బ్రాండెడ్ వీల్స్ వాటి అమరికలో వాహనం యొక్క బరువుకు నిజంగా సరిపోవు.

ఇలాంటి నాన్-బ్రాండెడ్ అల్లాయ్ వీల్స్‌తో జాగ్రత్త!! ఫార్చ్యూనర్ చూడండి ఎలా డ్యామేజ్ అయ్యిందో..?

ఆర్‌టిఓలో మార్పు నమోదు చేయకుండా, భారతదేశంలో వాహనంపై ఎలాంటి పెద్ద చక్రాలను ఉపయోగించినా అది చట్టవిరుద్ధమే అవుతుంది. కాబట్టి, ఒకవేళ మీ కారులో కూడా ఇలాంటి అల్లాయ్ వీల్స్ ఉపయోగించాలనుకుంటే, వాటి నాణ్యతను ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోండి. కేవలం బ్రాండెడ్ వీల్స్ మాత్రమే ఉపయోగించి, రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించండి.

More from DriveSpark

Article Published On: Monday, April 4, 2022, 11:08 [IST]
English summary
Beware of unbranded alloy wheels toyota fortuner crashed due to broken wheel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+