భారత్ బంద్‌లో కూడా డ్రైవ్‌స్పార్క్ న్యూస్ ఎలా అందించింది ?
దేశ వ్యాప్తంగా జరిగిన కార్మిక సమ్మెతో దేశ జన జీవనం స్తంభించిపోయింది. అందులో అతి ముఖ్యమైన ప్రజా రవాణా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో పూర్తిగా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితులలో అత్యవసర సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రితం రోజు (సెప్టెంబర్ 2) న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే నిరంతరం వాహన రంగానికి చెందిన వార్తలు అందిస్తున్న డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ సమ్మెలో కూడా వార్తలు ఎలా అందించింది అని చాలా ఆటోమొబైల్ కథనాల పాఠకులు ఆశ్చర్యపోతున్నారు. బంద్ రోజుల్లో కూడా తాజా వార్తలను అందించడంలో డ్రైవ్‌స్పార్క్ బృందం సఫలం చెందింది. అయితే ఇది ఎలా సాధ్యం అనేది చాలా మంది ప్రశ్న...

డ్రైవ్‌స్పార్క్‌కు చెందిన బొలెరో వాహనాన్ని కార్యాలయంగా మార్చుకుని దానిని తమ ఆఫీసుగా ఆటోమొబైల్ కథనాలను అందించారు. అందులో చిన్న పాటి వై-ఫై తో వాహనం వెలుపల డ్రైవ్‌స్పార్క్ బృందం ల్యాప్‌ట్యాప్ ద్వారా కథనాలను ప్రచురించారు.

బందులు, సమ్మెలు మరియు రాస్తా రోకోలు జరిగే సందర్భంలో ఆఫీసులు లేనపుడు కూడా వార్తలను ప్రచురించడంలో డ్రైవ్‌స్పార్క్ ఇప్పుడు మరో మైలు రాయిని చేరుకుంది. ఇలాగే బంద్ సందర్భాల్లో డ్రైవ్‌స్పార్క్ బృందం ఒక్కటై బొలెరోను కార్యాలయంగా చేసుకుని రహదారుల మీదే కథనాలను అందిస్తుంది.

తెలుగు పాఠకులకు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ విభిన్న రకాల ఆటోమొబైల్ వార్తలను అందిస్తోంది. తెలుగులో వాహన కథనాలను అందిస్తున్న ఏకైక్ ఆటోమొబైల్ వెబ్‌సైట్‌ను పూర్తి వివరాలకు తరచూ సందర్శించండి.
- డ్రైవ్‌స్పార్క్ తెలుగు కథనాలను ఫేస్‌బుక్ ద్వారా చదవడానికి మా పేజిని లైక్ చేయండి
- ట్విట్టర్ ద్వారా తాజా సమాచారం కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








