భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అమాంతం పెరుగుతున్న ఇంధన ధరలు. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపై ఎక్కువ భారాన్ని మోపుతున్నాయి. కావున ఇప్పుడు వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున దేశీయ విఫణిలోని దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి మంచి ఆధరణ పొందుతున్నాయి.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అయితే పెరుగుతోంది, కానీ వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎక్కువ సంఖ్యలో లేదు. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఎక్కువ అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తర్వాత భారత్ పెట్రోలియం సంస్థ కూడా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలుగులోకి వచ్చింది. దేశంలోని అతిపెద్ద పెట్రోలియం కంపెనీల్లో ఒకటైన భారత్ పెట్రోలియం వరానున్న మరో ఐదు సంవత్సరాల్లో దేశంలో ఏకంగా 7,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఒక ప్రకటన చేసింది.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

అయితే దేశంలో ప్రస్తుతం ఉన్న భారత్ పెట్రోలియం ఫ్యూయెల్ స్టేటన్స్ వద్ద ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ ప్రారంభించనున్న ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని 'ఎనర్జీ స్టేషన్లు' అని పిలుస్తారు. ఈ సందర్భంగా భారత్ పెట్రోలియం కంపెనీ మాట్లాడుతూ, ఈవి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కంపెనీకి కొత్త వ్యాపార అవకాశాన్ని అందిస్తుందన్నారు, అంతే కాకుండా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే కాలంలో ఆటో తయారీదారులు కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతారు. కావున ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎంతైనా అవసరం. కావున కంపెనీ దీనికోసం సన్నాహాలు చేస్తుంది, అన్నారు.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

ఇటీవల వెల్లడైన ఒక సమాచారం ప్రకారం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు జియో-బిపి తమ ఇంధన స్టేషన్స్ వద్ద వద్ద ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు తెలిసింది. రాబోయే 3 సంవత్సరాలలో 10,000 కొత్త ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారం ఇదివరకటి కథనాల్లోనే తెలుసుకున్నాం. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

ఈ సందర్భంగా భారత్ పెట్రోలియం చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కావాల్సిన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ కోసం విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ, రాబోయే సంవత్సరాలలో, పెరుగుతున్న ఈవి పరిశ్రమకు మద్దతుగా 7,000 స్టేషన్లను ఏర్పాటు చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము, అన్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ 'ఎనర్జీ స్టేషన్‌లు'గా పిలవబడతాయి.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

దేశంలోనే అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న పెట్‌చెమ్, గ్యాస్, కన్స్యూమర్ రిటైలింగ్, రెన్యూవబుల్స్ మరియు బయోఫ్యూయెల్స్‌తో పాటుగా బిపిసిఎల్ పనిచేస్తున్న ఐదు ఫోకస్ రంగాలలో ఈవి ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

2021 యునైటెడ్ స్టేట్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్న సమయంలో ఈ వార్త వచ్చింది. COP2గా పిలువబడే ఈ రెండు వారాల సదస్సు నవంబర్ 5 నుండి 12 వరకు USA లోని గ్లాస్గోలో జరుగుతుంది. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచ సహకారానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన పరీక్షగా పరిగణించబడుతుంది. భారతదేశం తన శక్తి అవసరాలను తీర్చడానికి పునరుత్పాదక శక్తిని ఉపయోగించడంపై పునరుద్ధరించబడిన మరియు విస్తరించిన ప్రణాళికలపై పని చేస్తోంది.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

ప్రపంచంలోని మొత్తం 'కార్బన్ డై అక్సైడ్' (CO2) ఉత్పత్తిలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్న చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారిణిగా ఉంది. ఇది రానున్న కాలంలో మరింత ఎక్కువవుతుంది. కావున ఈ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ఎంతైనా అవసరం. కావున ఇప్పటికే ఢిల్లీ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని అక్కడి ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి.

భారత్‌లో రానున్న 5 సంవత్సరాలలో 7,000 చార్జింగ్ స్టేషన్స్: భారత్ పెట్రోలియం

పునరుత్పాదక ఇంధనం మరియు క్లీన్ ఎనర్జీపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, భారత్ పెట్రోలియం ఈవి ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించే ప్రణాళికపై పని చేస్తోంది. భారత్ పెట్రోలియం కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,000 కంటే ఎక్కువ ఫ్యూయెల్ స్టేషన్స్ కలిగి ఉంది. అయితే కంపెనీ తన కొత్త 'ఎనర్జీ స్టేషన్లలో' ఏ రకమైన ఈవి ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే, కంపెనీ తన స్టేషన్లలో AC మరియు DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల ఛార్జర్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము.

ఇప్పటికే దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుదల దిశవైపు సాగుతోంది. అయితే దీనికోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తూ, అనేక రాయితీలను అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడంలో దోహదపడతాయి.

Most Read Articles

English summary
Bharat petroleum to establish 7000 ev charging stations in 5 years details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X