పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్రోల్ ధర రోజు రోజుకి పెరుగుదల దశగా పరుగులుపెడుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న ధర చరిత్రలో ఎన్నడూ పెరగనంత పెరిగిపోతోంది. ఇప్పుడు పెట్రోల్ ధర దాదాపు రూ. 100 దాటింది. పెట్రోల్ ధర దేశీయ మార్కెట్లో రూ. 100.04 కు పెరగడంతో వాహనదారులు ఒక్క సారిగా హవాక్కయ్యారు.

పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

ధరల పెరుగుదలను ఖండిస్తూ ఒక యువకుడు పెట్రోల్ బంక్ ముందు నిలబడి, చేతిలో క్రికెట్ బ్యాట్ మరియు క్రికెట్ హెల్మెట్ పట్టుకొని, సెంచరీ కొట్టిన తర్వాత క్రికెటర్లు బ్యాట్ పైకెత్తినట్లు, ఆ యువకుడు కూడా బ్యాట్ పైకెత్తి తన నిరసనను వ్యక్తం చేసాడు.

పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

ఆ యువకుడు చేసిన వినూత్న ప్రదర్శన, పెరుగుతున్న పెట్రోల్ ధరకు నిదర్శనం. ఈ ఫోటో ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో సహా పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. తన నిరసనను భిన్నంగా తెలిపిన ఆ యువకుడు యువ కాంగ్రెస్ సభ్యుడని తేలింది.

MOST READ:వారెవ్వా.. జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌కి 300 కార్లతో స్వాగతం చెప్పిన అభిమానులు

పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

గత కొన్ని రోజులుగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ అమాంతం పెరిగిపోతున్నాయి. ఇది వాహనదారుల పాలిట శాపమైపోయింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్టి ఇంకా చేర్చలేదు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక టాక్స్ విధిస్తాయి.

పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

ఈ కారణంగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధర పెరిగిపోయిది. పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ టాక్స్ తగ్గించే ఉద్దేశం లేదని స్పష్టం చేసారు.

MOST READ:ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న సూపర్ ఉమెన్ వీడియో

పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

మంత్రి ప్రకటనతో, వాహనదారులకు మరింత ఆందోళన కలిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులు ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి.

పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇప్పుడు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరిగింది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఎంజీ జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయిస్తున్నాయి.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

ఏది ఏమైనా ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భవిష్యత్ లో కూడా ఇదే విధంగా కొనసాగితే, సామాన్యుడు వాహనాలను వాడటానికి కచ్చితంగా వెనుకాడతాడు. అంతే కాకుండా ఇప్పుడు చాలామంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనటానికి సుముఖత చూపిస్తున్నారు.

Most Read Articles

English summary
Bhopal Youth Poses With Cricket Bat And Helmet At Petrol Bunk. Read in Telugu.
Story first published: Thursday, February 18, 2021, 11:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X