పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. రోజు రోజుకి కరోనావైరస్ వ్యాప్తి వేగవంతం అవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోగులకు కావలసినన్ని బెడ్లు, ఆక్సిజన్ మరియు అంబులెన్సులు అందుబాటులో లేదు. కావున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

ఇదిలా ఉంటె కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలు కనీసం నిత్యావసరాలు కూడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చాలామంది వారికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే నటుడు భువన్ పొన్నన్న, నటి హర్షిక పూంచ భువనం ఫౌండేషన్ ద్వారా కరొనాతో ఇబ్బంది పడుతున్నవారికి ఆహారానికి అవసరమైన సామగ్రి మరియు ఆక్సిజన్ వంటి వాటిని అందిస్తున్నారు.

పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

ఈ కరోనా కష్ట కాలంలో నటుడు, భువన్ పొన్నన్న, హర్షిక భువనం ఫౌండేషన్ 'భువనం' మరియు 'భాంధవ' అనే పేరుతో రెండు సర్వీసులను ప్రారంభించారు. ఈ రెండు సర్వీసులను ఫ్రీడమ్ పార్క్ వద్ద ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి రెండు ఆక్సిజన్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు.

MOST READ:స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త బజాజ్ పల్సర్ 250ఎఫ్ బైక్; వివరాలు

పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

అదే విధంగా భాందవ అనే ఆటోల ద్వారా మందులు, కిరాణా వస్తువులు, భోజనం మరియు ఆక్సిజన్ ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వీస్ బెంగళూరులో నిర్వహించబడుతోంది, అయితే ఈ సర్వీస్ కేవలం బెంగళూరుకి మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రమంతటా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భువన్ పొన్నన్న తెలిపారు.

పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

భువన్ పొన్నన్న మరియు హర్షిక పూంచ ఈ సమయంలో చేస్తున్నఉదారమైన ఈ పనికి ఎంతోమంది వారిని ప్రశంసిస్తున్నారు. భువన్ పొన్నన్న ఇంతకు ముందు పేద ప్రజల సహాయార్థం హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించారు. సహాయం అవసరమైన వారికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా కాల్ చేయడానికి ప్రైవేట్ నంబర్ ఇవ్వబడింది.

MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు

పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

ఈ హెల్ప్‌లైన్ నెంబర్ కి రోజుకు 3,000 నుంచి 4,000 కాల్స్ రావడం ప్రారంభమైంది. అప్పుడు అతను దాని కోసం ఒక బృందాన్ని సృష్టించి చాలా మందికి సహాయం చేశాడు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో కూడా వీరు చేస్తున్న పనికి ఎంతోమంది మెచ్చుకున్నారు.

పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

ఇటీవల ఒక వారం క్రితం, సుమారు 150 కుటుంబాలకు ఆహార వస్తు సామగ్రిని కూడా పంపిణీ చేశారు. వీరు అందించిన ఈ ఆహార సామగ్రిలో బియ్యం, పప్పుధాన్యాలు, చక్కెర, వంట నూనె, గోధుమ పిండి మరియు కూరగాయలు వంటివి ఉన్నాయి.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

గతంలో కూడా భువన్ పొన్నన్న, హర్షిక పూంచ చామందికి పేదప్రజలకు సహాయం చేసినట్లు కూడా తెలిసింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ మహమ్మరి అధికంగా విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు ఉదారంగా సేవలందిస్తూ ఎంతోమంది ప్రశంసలు పొందుతున్నారు.

Most Read Articles

English summary
Bhavanam Foundation Starts Oxygen Express Service. Read in Telugu.
Story first published: Saturday, May 15, 2021, 11:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X