మీకు తెలుసా.. 'సైకిల్ గర్ల్' తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ఎంతో మంది ప్రజల జీవితాలను దుర్భర స్థితిలో తోసివేసింది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రజలు మరణించారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ వైరస్ సంక్రమణ ఈ రోజుకి కూడా సంక్రమిస్తూనే ఉంది.

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

కరోనా మహమ్మారి నివారణ కోసం గత సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా 2020 మార్చిలో లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల కరోనా సంక్రమణ కొంతవరకు తగ్గింది కానీ, ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. రోజువారీ కూలీల పరిస్థితి మరింత కష్టంగా మారింది.

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

కరోనా లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆటో మొబైల్ పరిశ్రమ కూడా అన్ని వ్యాపారాల మాదిరిగానే తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ ప్రభావం వల్లనే 2020 ఏప్రిల్ నెలలో దేశంలో ఒక్క వాహనం కూడా విక్రయించబడలేదు. కరోనా లాక్ డౌన్ ఆటో మొబైల్ పరిశ్రమ మీద చూపిన ప్రభావాన్ని పక్కన పెడితే, వలస కూలీల సంగతి చాలా కష్టంగా మారింది.

MOST READ:ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

లాక్ డౌన్ సమయంలో ప్రజా రవాణా మొత్తం నిషేధించబడింది. ఇందులో భాగంగానే బస్ సర్వీసులు, ట్రైన్ సర్వీసులన్నీ నిలిపివేయబడ్డాయి. ఈ కారణంగానే ఎంతో మంది కూలీలు కాలినడకన కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు.

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

మరికొందరు అందుబాటులో ఉన్న వాహనాల్లో తిరిగి వారి స్వగ్రామాలకు చేరారు. వీరిలో జ్యోతి కుమారి కూడా ఉన్నారు. ఆమె తన తండ్రిని 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి సైకిల్‌పై తీసుకెళ్లి దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారా, ఆమె సైకిల్ గర్ల్ గా ప్రాచుర్యం పొందింది.

MOST READ:ఇల్లు వదిలి కరోనా బాధితులకు సర్వీస్ చేస్తున్న ఐటీ ఉద్యోగి

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

జ్యోతి కుమారి చేసిన ఈ సాహసానికి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసించింది. 1,200 కిలోమీటర్ల సైకిల్‌పై సొంతగ్రామానికి తండ్రితో చేరిన జ్యోతి కుమారి ఆశలు ఎంతో కాలం నిలువలేదు. కాలం కన్నెర్ర జేసి తన తండ్రిని తీసుకెళ్ళిపోయింది.

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

ఇటీవల జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాస్వాన్ గుండెపోటుతో మరణించారు. ఈ వార్తలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. జ్యోతి కుమారి తండ్రి మరణవార్త విని ఎంతో మంది ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి కుమారి బీహార్ లోని దర్భంగా జిల్లాలో నివసిస్తున్నారు.

MOST READ:కరోనా ఎఫెక్ట్; 4 రోజులు, 300 కి.మీ సైకిల్ ప్రయాణం.. కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

గత సంవత్సరం కరోనా సమయంలో అతని కాలికి దెబ్బ తగలడం వల్ల అతడు పని చేయలేకపోయాడు. తద్వారా వీరి ఇంటి అద్దె మొదలైనవి కట్టడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఈ కారణంగానే తమ స్వగ్రామానికి చేరుకోవాలని నిర్ణయించుకుని సైకిల్ పై 1200 కిలోమీటర్లు ప్రయాణించి సొంత ఊరు చేరుకున్నారు.

గుండెపోటుతో కన్నుమూసిన 'సైకిల్ గర్ల్' తండ్రి

జ్యోతి చేసిన సాహసాన్ని దేశ ప్రజలతోపాటు ఇండియన్ సైక్లింగ్ పెడరెషన్ కూడా గుర్తించి ఆమెకి ఉచితంగా సైక్లింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంతే కాకుండా ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి బాలల పురస్కారం కూడా అందుకుంది. దీనితోపాటు ఆత్మనిర్భర్ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను తెరమీదకెక్కిస్తున్నారు, ఇందులో జ్యోతి తన పాత్రను తానే పోషిస్తోంది.

MOST READ:డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

Most Read Articles

English summary
cycle Girl's Father Dies Due To Cardiac Arrest. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X