రేంజ్ రోవర్ కారుతో రేంజ్ పెంచేసిన బిగ్‌బాస్ విన్నర్ - వీడియో
హిందీ బిగ్‌బాస్ 17 సీజన్ విజేత 'మునావర్ ఫరూఖీ' గురించి దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బిగ్‌బాస్ 17 విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్న ఇతడు ఇటీవల ఖరీదైన 'రేంజ్ రోవర్' (Range Rover) కొనుగోలు చేశారు.
కామెడీ వీడియోలు చేస్తూ అధిక ప్రజాదరణ పొందిన యాక్టర్ 'మునావర్ ఫరూఖీ' (Munawar Faruqui) బిగ్‌బాస్ 17 సీజన్ విన్నర్ అయిన తరువాత కూడా వివిధ కార్యకమాల్లో పాల్గొని తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా ఇటీవల ఇతడు బ్లాక్ కలర్ 'రేంజ్ రోవర్ స్పోర్ట్' కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. కారు నుంచి మునావర్ ఫరూఖీ దిగి బయటకు రావడం చూడవచ్చు. ఇందులో ఇతడు చాలా సంతోషంగా ఉండటం గమనించవచ్చు. ఈ కారు గుజరాత్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉంది. ఒక ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ గమనించవచ్చు. భారతదేశంలో రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు ప్రారంభ ధర రూ. 1.7 కోట్లు (ఎక్స్ షోరూమ్).
మునావర్ ఫరూఖీ వద్ద ఇప్పటికే మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో, టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ మరియు హ్యుందాయ్ క్రెటా కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు కొత్త రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు అతడు కొనుగోలు చేసిన ఖరీదైన కార్లలో ఇదే ఎక్కువ కాస్ట్ అని తెలుస్తోంది. కొత్త కారు కొన్న సందర్భంగా అతని అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న మునావర్.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్ 17లో ప్రవేశించిన తరువాత అభిమానుల సంఖ్య మరింత పెరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇతడు కొన్ని రోజులకు ముందు ఓ మ్యూజిక్ వీడియో కూడా విడుదల చేశారు. హల్కి హల్కి సి రీక్రియేషన్‌లో హీనా ఖాన్‌తో కలిసి అభిమానులను మరింత ఫిదా చేశారు.
ఇక రేంజ్ రోవర్ స్పోర్ట్ విషయానికి వస్తే.. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 3.0 లీటర్ టర్బో డీజిల్ మరియు 3.0 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 400 బీహెచ్‌పీ పవర్ అందిస్తుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 350 బీహెచ్‌పీ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మునావర్ ఫరూఖీ యొక్క కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్.. ఏ ఇంజిన్ (పెట్రోల్ లేదా డీజిల్) కలిగి ఉందనే విషయం స్పష్టంగా తెలియదు. ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో మంచి డిజైన్ కలిగిన స్టీరింగ్ వీల్, స్టీరింగ్ టచ్ ఫెదర్ బటన్స్, సెంటర్ కన్సోల్‌లో ఫ్లోటింగ్ స్క్రీన్, దానికి కింద మాన్యువల్ బటన్స్ మరియు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవి చూడవచ్చు.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి వంటివి ఇందులో లభిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి మరీ ఈ ల్యాండ్ రోవర్ కార్లను కొనుగోలు చేస్తున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








