బిగ్‌బాస్‌ విన్నర్ కారు చూశారా.. తేనేటీగల వలె గుమికూడిన జనాలు! దీని రేట్ ఎంతో తెలుసా..

ఒక్కసారి సెలబ్రిటీ అయితే చాలు ఎక్కడికి వెళ్లిన, ఏం చేసిన కూడా వారి గురించే మాట్లాడుకుంటారు. ముఖ్యంగా బిగ్‌ బాస్‌లో కనిపిస్తే చాలు సమాజంలో పేరు ప్రఖ్యాతలు, సెలబ్రిటి హోదా ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయి. తెలుగులోనే కాకుండా దేశంలోని ప్రధాన భాషల్లో కూడా బిగ్‌ బాస్ విజయవంతంగా రన్ అవుతుంది. మొదటగా హిందీలో మొదలైన ఈ ప్రోగ్రామ్‌కు మంచి ఆదరణ రావడంతో క్రమంగా ఇతర భాషల్లో కూడా దీన్ని తీసుకురావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం బిగ్‌ బాస్ కన్నడ, బెంగాళి, తమిళ్ వంటి ఏడు దేశీయ భాషల్లో రన్ అవుతుంది. అన్నింటిలో కూడా మంచి సక్సెస్ అయింది. ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్న కొద్ది సీజన్లు వరుసగా అన్ని భాషల్లో కూడా వస్తూనే ఉన్నాయి. వీటిలో పాల్గొనే వారిని ఆచితూచి ఎంపిక చేస్తారు.

ఈ షోలో ఎంటర్ కావాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. ఒక్క సీజన్‌లో ఎంటర్ అయిన చాలు పెద్ద ఎత్తున ఫేమ్ వస్తుంది. య్యూటూబ్‌లో పేరు ఉన్న వారిని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిని, సినిమాల్లో నటించిన వారిని బిగ్‌ బాష్ షోకు తీసుకువస్తారు. షో నుంచి బయటకు వచ్చిన తరువాత వారు పెద్ద సెలబ్రిటీగా మారిపోతారు. ముఖ్యంగా విన్నర్‌‌కు మరింత పెద్ద స్టార్ హోదా వచ్చేస్తుంది.

Bigg Boss 17 Winner Munawar Faruqui

తెలుగు బిగ్‌బాస్‌ షో గత సీజన్ల కంటెస్టెంట్స్‌కి మంచి ఫేమ్ వచ్చింది. విన్నర్లు అయితే ఇప్పుడు సెలబ్రిటీలుగా ఉన్నారు. పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌ చేస్తున్నారు. కొందరు సినిమాల్లో నటిస్తున్నారు. వీరు ఎక్కడ కనిపించిన కూడా జనాలు వీరి చుట్టే గుమిగూడతారు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న వారు ఏం చేసిన, ఏం మాట్లాడిన కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.

తెలుగు బిగ్‌బాస్ షోకి మాత్రమే కాకుండా, హిందీ షోకు కూడా మరింత ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఈ షోలో పాల్గొన్న వారు ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇటీవల హిందీ బిగ్ బాస్ 17 విన్నర్ మునవర్ ఫరూఖీ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. తాజాగా ఆయన రేంజ్ రోవర్ కారుతో బయట కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Faruqui Spotted Range Rover

మునవర్ ఫరూఖీ స్టాండ్ అప్ కమెడియన్‌ గానే కాకుండా పాటలు కూడా పాడుతుంటాడు. ఆయనకు బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ 17 సీజన్ విజేతగా కూడా నిలిచాడు. ఆయన ఇటీవల క్యాన్సర్ అవేర్‌నెస్ గురించి అందరికి అవగాహన కల్పించడానికి నిర్వహించిన ఒక మారథాన్‌కు వచ్చారు. రేంజ్ రోవర్ స్పోర్ట్ కారులో వచ్చిన ఆయన చుట్టూ భారీ జనసందోహం చేరింది.

దీంతో బౌన్సర్లు ఆయనకు రక్షణగా ఉన్నారు. మునవర్ ఫరూఖీని చూడటానికి జనం భారీగా అక్కిడికి చేరారు. ఆయనతో సెల్ఫీలు దిగాలని చూశారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మారథాన్‌కు వచ్చిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా, సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఆయన అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఎక్స్‌లో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Munawar Faruqui Spotted With Range Rover

ఇదిలా ఉంటే మునవర్ ఫరూఖీ రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇది ఇండియా మార్కెట్లో రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.40 కోట్లుగా ఉంది. అదే ఆన్-రోడ్ ధర అయితే మరింత ఎక్కువగా రూ.1.64 కోట్ల వరకు ఉంది. ఇది 3.0-లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, 3.0-లీటర్ డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది.

పెట్రోల్ ఇంజిన్ 398 PS పవర్, 550 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే డిజిల్ ఇంజిన్ 351 PS పవర్, 700 Nm గరిష్ట టార్కును విడుదల చేస్తుంది. ఈ రెండిట్లో కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సెటప్‌ను అందించారు. ఈ కారులో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. లోపల 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, 13.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 6, 2024, 16:15 [IST]
English summary
Bigg boss 17 winner munawar faruqui spotted with range rover sport car
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+