డ్రీమ్ కారు కొనుగోలు చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. అమెరికన్ బ్రాడ్ గురూ!
భారతదేశంలో సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే రియాలిటీ టెలివిజన్ షో బిగ్‌బాస్ కంటెస్టెంట్ 'అభిషేక్ కుమార్' ఓ ఖరీదైన జీప్ రాంగ్లర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో కారును డెలివరీ తీసుకోవడం.. డెలివరీ సమయంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం, అంతకు ముందే మహీంద్రా థార్ ఉన్నట్లు వెల్లడించడం.. చివరకు జీప్ రాంగ్లర్ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వంటివి చూడవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
వీడియోలో గమనిస్తే.. అభిషేక్ కుమార్ తన ఇంటి నుంచి బయలుదేరడం చూడవచ్చు. తన తల్లితో మాట్లాడుకుంటూ.. తాను కొనుగోలు చేయనున్న కారు గురించి ప్రస్తావిస్తారు. ఆ తరువాత తల్లిదండ్రులు మరియు స్నేహితులతో కలిసి చండీగఢ్‌లోని ఒక డీలర్‌షిప్‌కి వెళ్ళాడు. అప్పటికే కారు డెలివరీకి సిద్ధంగా ఉంది. అభిషేక్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇవన్నీ స్పష్టంగా వీడియోలో కనిపిస్తాయి.

అభిషేక్ కుమార్ ఒకప్పుడు ముంబై నుంచి పంజాబ్ వరకు మహీంద్రా థార్ ఎలా డ్రైవ్ చేసారో కూడా ఇక్కడ వెల్లడించారు. ఈ SUVని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం అతడు నివసించే ప్రాంతం చుట్టూ ఉన్న రోడ్లు, పరిస్థితులు అని తెలుస్తోంది. సాధారణ కార్లు కఠినమైన రోడ్డులో ప్రయాణించడం కష్టం. అయితే ఆఫ్-రోడర్స్ ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా ముందుకు సాగుతాయి.
మహీంద్రా థార్ పరిమాణంలో.. రాంగ్లర్ కంటే చిన్నదిగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని అందించినప్పటికీ తన తల్లి వెనుక సీటులో ఎక్కడానికి కొంత ఇబ్బంది పడేదని చెప్పుకొచ్చాడు. అయితే జీప్ కంపెనీ యొక్క రాంగ్లర్ కారు 5 డోర్స్ SUV. ఇది అద్భుతమైన ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని అందించడం మాత్రమే కాకుండా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.

అభిషేక్ కుమార్ జీప్ రంగ్లర్ రూబీకాన్ కొనుగోలు చేశారు. దీనిని చండీగఢ్‌లో ప్రీమియం యూజ్డ్ కార్ డీలర్ అయిన ఆటో గ్యాలరీ డెలివరీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారు రెడ్ ఇన్సర్ట్‌లతో బూడిద రంగులో ఉంది. ఇక్కడ కనిపించే కారు 2021 జీప్ రాంగ్లర్ మోడల్ అని తెలుస్తోంది. కారును డెలివరీ చేసే సమయంలో డీలర్‌షిప్ సిబ్బంది కారు గురించి చాలా వివరాలు వెల్లడిస్తారు.
ఇలాంటి అద్భుతమైన కారును కొనుగోలు చేయాలని తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లు అభిషేక్ వెల్లడించారు. ఇప్పటికె తనకు ఇష్టమైన కారు మహీంద్రా థార్ కొనుగోలు చేసినట్లు, జీప్ రాంగ్లర్ కొనుగోలు చాలా పెద్ద కల అని అతడు వెల్లడించాడు. జీప్ రాంగ్లర్ SUV భారతదేశంలో ఖరీదైన కార్ల విభాగంలో ఒకటి. దీని ధర రూ. 67.65 లక్షల నుంచి రూ. 71.65 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.
జీప్ రాంగ్లర్ SUVలో 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 268 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 4x4 సిస్టం కూడా పొందుతుంది. కాబట్టి ఇది కఠినమైన రోడ్డులో కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. మొత్తం మీద ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








