సంక్రాంతికి ఖరీదైన కారు కొనేసిన 'హిమజ': ఆ కారు ధర ఎంతో తెలుసా..!!
నిజానికి కొత్త కార్లు లేదా బైకు కొనాలంటే ఎక్కువ మంది ఏదైనా పండుగ సమయంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా ఉంటారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా తెలుగు బుల్లి తెర నటి హిమజ ఖరీదైన కారుని కొనుగోలు చేసింది. హిమజ కొనుగోలు చేసిన ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మొదట్లో బుల్లి తెర నటిగా పేరు తెచ్చుకుని తరువాత సినీరంగంలో ప్రవేశించి చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన హిమజ ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్ 3 రియాలిటీ షో ప్రవేసింది అక్కడ కూడా తనదైన గుర్తింపు పొందింది. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హిమజ యూట్యూబ్ ఛానల్ కూడా కలిగి ఉంది. అయితే ఈమె ఇటీవల సంక్రాతి సందర్భంగా ఒక కొత్త ఫ్యామిలీ కారుని కొనుగోలు చేసింది.

హిమజ కొనుగోలు చేసిన కారు కియా మోటార్స్ కంపెనీ యొక్క కార్నివాల్ అని తెలుస్తుంది. ఈ కియా కార్నివాల్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 30 లక్షల నుంచి ఉంటుంది. కావున హిమజ కొనుగోలు చేసిన కారు యొక్క ఖచ్చితమైన ఖరీదు తెలియదుఎం దీని ధర బహుశా రూ. 40 లక్షల కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

నిజానికి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో కియా కార్నివాల్ ఒకటి. ఇది కుటుంబంతో కలిసి వెళ్లడానికి చాలా అనుకూలంగా ఉండే 7 సీటర్ కారు. కావున ఎక్కువ మంది ఫ్యామిలీతో వెళ్లడానికి ఈ కారుని ఎంపిక చేసుకుంటారు. ఈ కారుని కూడా హిమజ తన కుటుంబం కోసమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

హిమజ కొనుగోలు చేసిన కారుకి సంబంధించిన వీడియో కూడా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. "అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, ఈ కియా కార్నివాల్ కారుని నా కుటుంబానికి సంక్రాంతి సర్‌ప్రైజ్ చేయడానికి, ఇది కేవలం మీ ఆశీస్సులతోనే సాధ్యమైంది, లవ్ యు ఆల్" అంటూ రాసుకొచ్చింది.
హిమజ షేర్ చేసిన ఈ వీడియో చూసిన చాలామంది అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో మీరు కూడా కియా కార్నివాల్ చూడవచ్చు. ఈ వీడియోలో బ్లాక్ కలర్ కియా కార్నివాల్ చాలా అద్భుతంగా ఉంది, అంతే కాకుండా ఇందులో హిమజ కేక్ కట్ కారుతో బయటకు రావడం వంటివి కూడా చూడవచ్చు.

ఇక కియా కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కియా కార్నివాల్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన డిజైన్ అధునాతన పరికరాలను కలిగి MPV. ఇందులో 2.2 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 197 bhp పవర్ మరియు 440 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

కియా కార్నివాల్ MPV విశాలమైన టైగర్‌నోస్ గ్రిల్, సొగసైన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఐస్ క్యూబ్ ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు మరియు క్రోమ్ యాక్సెంట్ వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ క్రోమ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్, వెనుక భాగంలో LED టెయిల్‌లైట్‌లు మరియు టెయిల్‌గేట్‌పై సూక్ష్మమైన క్రోమ్ హైలైట్ వంటివి చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ సన్‌రూఫ్, 8 స్పీకర్ హార్మన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, రియర్-వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్స్ మరియు 10.1 ఇంచెస్ రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, స్మార్ట్ ఎయిర్-ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్మార్ట్ పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైనవి ఉన్నాయి.

కియా కార్నివాల్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రోల్-ఓవర్ మిటిగేషన్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

ఇదిలా ఉండగా హిమజ ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కారు మరియు మహీంద్రా థార్ వంటి వాటిని కూడా కలిగి ఉంది. గతంలో సినీరంగంలో అడుగుపెట్టాక ముందు చాలా ఉద్యోగాలు చేసి తన కష్టార్జితంతో మెర్సిడెస్ బెంజ్ కొన్నట్లు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొంది సంక్రాంతి పండుగ వేళా మరో అద్భుతమైన కారుని కొనుగోలు చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








