షణ్ముక్ జశ్వంత్ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కార్.. ధర ఎంతంటే?
'షణ్ముక్ జశ్వంత్' అంటే తెలియని వారు దాదాపు ఎవరు ఉండరు. వెబ్ సిరీస్ లతోనే భారీ స్థాయిలో క్రేజ్ పెంచుకున్న ఇతడు టిక్ టాక్ మరియు ఇన్స్టా రీల్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో రన్నర్ గా నిలిచి మరింత ఎక్కువమంది ఫ్యాన్స్ పొందాడు. అయితే యితడు ఇటీవల విజయదశమి సందర్భంగా ఒక కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసాడు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. రండి.

షార్ట్ ఫిల్మ్స్ తో ప్రారంభమైన షన్ను ప్రయాణం ఇప్పుడు ఒక ఖరీదైన కారుకి ఓనర్ అయ్యాడు. ఇతడు కొన్న లగ్జరీ కారు 'బిఎండబ్ల్యు' (BMW) కంపెనీ యొక్క '2 సిరీస్ గ్రాండ్ కూపే'. ఈ కారు ధర సుమారు రూ. 50 లక్షలకు పైనే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

షన్ను కారు కొన్న సందర్భంగా ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసాడు. ఇందులో 'ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది. నా ఫ్యామిలీ తరువాత ఆ పొజిషన్ లో చూడాలనుకుంది మీరే, అంటూ.. ఐ లవ్ యు 3000' అని రాసుకొచ్చాడు. దీనికి చాలామంది అభిమానులు లైక్ చేశారు, కొంతమంది కామెంట్స్ కూడా చేసారు.

ఇక షణ్ముఖ్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్ విషయానికి వస్తే, ఇది జర్మన్ బ్రాండ్ కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, స్టైలిష్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ముందు భాగంలో బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ మొదలైన ఫీచర్లు ఉంటాయి

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు పెద్ద డిస్‌ప్లే స్క్రీన్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (12.3 ఇంచెస్) మరియు మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25 ఇంచెస్). ఇంకా ఇందులో యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఎసి వెంట్స్, ఎలక్ట్రిక్ మెమరీ ఫంక్షన్‌తో కూడిన స్పోర్ట్స్ సీట్స్, పానోరమిక్ గ్లాస్ రూఫ్, 40:20:40 స్ప్లిట్ రియర్ సీట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, మెల్బోర్న్ రెడ్ మరియు స్టార్మ్ బే కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

బిఎండబ్ల్యు 2 సిరీస్ గ్రాండ్ కూపే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ట్విన్‌పవర్ టర్బో ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 7.1 సెకన్స్ లో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

అరేయ్ ఏంట్రా ఇది అనే డైలాగ్ వింటేనే షన్ను గుర్తుకు వస్తాడు. ఇతడు క్రమక్రంగా ఎదిగి ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయితే విజయదశమి సందర్భంగా కొత్త కారుని కొనుగోలు చేసే ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అంతే కాకూండా ఇటీవల బిత్తిరి సత్తి, కీర్తి సురేష్ వంటి వారు కూడా ఇటీవల ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు.


Click it and Unblock the Notifications








