ఖరీదైన కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ 'సిరి హన్మంతు': ధర ఎంతో తెలుసా?
సెలబ్రెటీలు, క్రికెటర్లు మరియు పారిశ్రామికవేత్తలు సాధారణ ప్రజలకంటే ఎక్కువుగా కార్లు మరియు బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పుడప్పుడు కమీడియన్లు, సీరియల్ నటులు కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల 'సిరి హన్మంతు' ఒక ఖరీదైన చైనీస్ బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, సిరి హన్మంతు కొనుగోలు చేసిన వెహికల్ 'ఎంజి మోటార్స్' (MG Motors) యొక్క 'హెక్టర్' (Hector). దీని ధర సుమారు రూ. 20 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కంపెనీ యొక్క పాపులర్ వెహికల్ మరియు అత్యధిక అమ్మకాలు పొందుతున్న మోడల్. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఎంజి హెక్టర్ ముందు భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పెద్ద ఎయిర్ డ్యామ్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ మరియు ఫాగ్ లాంప్ వంటివి కూడా ఉన్నాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.4 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, రియర్ ఎసి వెంట్స్, డ్యూయల్ పెన్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు 360 డిగ్రీల కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

సిరి హన్మంతు కొనుగోలు చేసిన ఈ ఎంజి హెక్టర్ పెట్రోల్ వేరియంటా లేదా డీజిల్ వేరియంటా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఇది 1.5 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంది.
కావున 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 141 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

తెలుగు షార్ట్ ఫిలిమ్స్ మరియు చిన్న చిన్న సీరియల్స్‌లో కనిపిస్తూ తనదైన రీతిలో తెలుగువారిని ఆకట్టుకున్న 'సిరి హన్మంతు' ఒక్క సారిగా బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో పాపులర్ అయ్యింది. అందంతో పాటుగా ఆకట్టుకునే అభినయంతో పాపులర్ అయిన సిరి, ఒక్కసారిగా బిగ్‌బాస్ హౌస్‌లో యూట్యూబర్ షణ్ముక్‌తో నడిపిన ప్రేమాయణంతో మరింత వెలుగులోకి వచ్చేసింది.

ఆ తరువాత షణ్ముక్, దీప్తి సునైనా విడిపోవడానికి కూడా సిరి కారణం అంటూ ఎన్నెన్నో వార్తలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా సిరి బాయ్‌ఫ్రెండ్ 'శ్రీహన్' కూడా ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు కూడా కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. దీనికి తోడు శ్రీహన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో సిరి ఫొటోలను మరియు వీడియోలను తొలగించడం వల్ల ఇది నిజమే అని అందరూ నమ్మేశారు.

అయితే ఇప్పుడు సిరి హన్మంతు మరియు శ్రీహన్ ఇద్దరూ ఒకే ప్రేమ్ లో కనిపించగానే అవన్నీ నిజంగా కావని తెలుస్తోంది. వీరిద్దరూ ఇటీవల చైనా కార్ తయారీ సంస్థ 'ఎంజి మోటార్' (MG Motor) కంపెనీ యొక్క 'హెక్టర్' (Hector) కొనుగోలు చేసారు దీనికి సంబంధించిన ఫోటోలు శ్రీహన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసాడు. ఇవి సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలలో ఎంజి హెక్టర్ డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. అదే సమయంలో శ్రీహన్ ఇలా రాసాడు.. "ఎంజి హెక్టర్ కి స్వాగతం, కంగ్రాట్యులేషన్ సిరి హన్మంతు అంటూనే ముందు డ్రైవింగ్ నేర్చుకో అని సెటైర్ వేసాడు". ఈ ఫోటోలు ఇద్దరూ కలిసి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వారిద్దరూ మళ్ళీ కలిసిపోయినట్లు తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఎంజి మోటార్ యొక్క హెక్టర్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు దీనిని కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ మోడల్ కి 'సిరి హన్మంతు' కూడా ఓనర్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రమే కాకుండా.. కొత్త కార్లు మరోయు కొత్త బైకులకు సంబంధించిన మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications