బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ ప్రోగ్రామ్స్ లో ''బిగ్ బాస్'' రియాలిటీ షో ఒకటి. ఈ బిగ్ బాస్ షో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ షోలో కనిపించిన కంటెస్టెంట్స్ ఒక చిన్న సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోతారు.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

సాధారణంగా మనం ఎంతసేపు ప్రముఖ హీరోలు మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కొనువులుచేసిన లగ్జరీ వాహనాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొనుగోలుచేసిన కార్లు గురించి కూడా తెలుసుకున్నాం. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మరియు టిక్ టాక్ స్టార్ అయిన ధనుశ్రీ కొనుగోలు చేసిన కార్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 8 లో పాల్గొన్న టిక్ టాక్ స్టార్ 'ధనుశ్రీ' మొదటి వారం మంచి పర్ఫామెన్స్ తో చాలా ప్రశంసలు అందుకుంది. అయితే ధనుశ్రీ ఇప్పుడు కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ధనుశ్రీ కొనుగోలు చేసిన మొదటి కారు కూడా ఇదే.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

ధనుశ్రీ కొనుగోలు చేసిన కొత్త కారు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధనుశ్రీ కొనువులు చేసిన ఈ కొత్త కారు Maruti Suzuki (మారుతి సుజుకి) యొక్క Swift (స్విఫ్ట్). ఈ కొత్త కారు డెలివరీ చేస్తున్న ఫోటోలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

బిగ్ బాస్‌ రియాలిటీ షోలో కనిపించడానికి ముందే, ధనుశ్రీ మంచి టిక్ టాక్ స్టార్ గా ఎదిగింది. టాక్ టాక్ లో తాను చేసిన వీడియోలకు గాను మిలియన్ల మంది ఫాలోవర్స్ ని పొందింది. బిగ్ బాస్ తరువాత ఈ సంఖ్య మరింత పెరిగింది. బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తరువాత మరింత ఫెమస్ అయ్యింది.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

ధనుశ్రీ ప్రముఖ బ్రాండ్ డిజిటల్ యాడ్స్‌లో కూడా కనిపించింది. అంతే కాకుండా ఈమెకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో 3 లక్షల 60 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బిగ్ బాస్ తరువాత సినిమా మరియు ఫోటో షూట్ వంటి వాటిలో ఈమె మరింత బిజీ అయిపొయింది.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

అయితే ఇప్పుడు ధనుశ్రీ కొనుగోలు చేసిన మారుతి సుజుకి కారు విషయానికి వస్తే, ఇది డ్యూయల్ టోన్ మారుతి స్విఫ్ట్. మారుతి స్విఫ్ట్ గత 15 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. దేశీయ మార్కెట్‌లో స్విఫ్ట్ రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బాగా అమ్ముడవుతోంది. ప్రస్తుత తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 2017 ప్రారంభంలో భారతదేశంలో మారుతి సుజుకి ద్వారా ప్రారంభించబడింది. మారుతి సుజుకి యొక్క కొత్త స్విఫ్ట్ ఇప్పుడు భారత మార్కెట్లో విక్రయించబడుతుంది.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

కొత్త మారుతి స్విఫ్ట్ కారులో ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉంది, కావున ఇందులోని హెడ్‌లైట్లు, డిఆర్ఎల్ లు మరియు టెయిల్‌లైట్లు అన్ని కూడా ఎల్ఈడీ లైట్స్. ఇందులోని స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంది. ఈ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు మల్టీ-కలర్ MID, ఫ్లాట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

స్విఫ్ట్ కారు ముందు భాగంలో క్రోమ్ యాక్సెంట్స్ తో ఆకర్షణీయమైన క్రాస్ మెష్ గ్రిల్ మరియు గ్రిల్ చుట్టూ అందించిన బ్లాక్ స్ట్రిప్ ఉంటాయి. ఇవన్నీ కారు యొక్క ఆకర్షణను మరింత పెంచడంలో దోహదపడతాయి. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మారుతి సుజుకి అమ్మకాల పేరుదలకు స్విఫ్ట్ కారు చాలా దోడపడుతుంది.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

మారుతి సుజుకి భారతదేశంలో కొత్త జనరేషన్ మారుతి స్విఫ్ట్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే రాబోయే న్యూ జనరేషన్ మోడల్‌లో చాలా మార్పులు ఉంటాయి. కొత్త తరం స్విఫ్ట్ కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించబోతోంది. కొత్త తరం మారుతి స్విఫ్ట్ కారును హార్ట్ టెక్ ప్లాట్‌ఫాం కింద తయారు చేయవచ్చు. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ యొక్క భద్రత మరియు పనితీరులో ఈ కొత్త మారుతి స్విఫ్ట్ మునుపటి మోడల్ కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ 'ధనుశ్రీ' కొత్త కార్.. చూసారా!!

కొత్త మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ 12 ఎన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 89 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. మారుతి స్విఫ్ట్ ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ మరియు ఫోర్డ్ ఫిగో వంటి వాటికి ప్రత్యర్దియా ఉంటుంది.

Most Read Articles

English summary
Bigg boss kannada season 8 fame dhanushree bought new maruti swift car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X