బీహార్ సీఎం కొత్త కారు ఇదే.. ధర ఎన్ని లక్షలో తెలుసా?
ఆధునిక భారతదేశంలో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే బీహార్ ముఖ్యమంత్రి సాధారణ కార్లను విడిచి ఎలక్ట్రిక్ కారుకు మారారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మార్పు అంటే ఎక్కడినుంచో రాదు, మన నుంచే మొదలవ్వాలి అనే చందాన.. బీహార్ ముఖ్యమంత్రి 'నితీష్ కుమార్' (Nitish Kumar) హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారుకు మారిపోయారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడమే కాకుండా.. ప్రజలకు కూడా ఆదర్శంగా ఉండటానికి, వారిని కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని చెప్పకనే చెప్పడానికి.. ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.

గతంలో అంబాసిడర్ మరియు టాటా సఫారీ వంటి కార్లకు అలవాటు పడిన నితీష్ కుమార్ ఎలక్ట్రిక్ కారుకు మారుతూ.. ఎలక్ట్రిక్ కార్లకున్న ప్రాధాన్యతను చెబుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నాయి. అయితే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం అటు ఫ్యూయెల్ కార్స్.. ఇటు ఎలక్ట్రిక్ కార్స్ కాకుండా అప్డేటెడ్ హైడ్రోజన్ కారును ఉపయోగిస్తున్నారు.
హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq5)
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అధునాతన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి 'హ్యుందాయ్' కంపెనీకి చెందిన 'ఐయోనిక్5'. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు ధర కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు కంటే కూడా చాలా తక్కువ. షారుఖ్ ఖాన్ వద్ద కూడా ఈ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కారు ఉంది. దీన్ని బట్టి చూస్తే దీనికున్న ఆదరణ ఇట్టే అర్థమయిపోతుంది.

హ్యుందాయ్ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో ఏకంగా 631 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ 214 బిహెచ్‌పి పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా, దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా.. అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.
హ్యుందాయ్ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులేటర్ ప్లాట్‌ఫామ్ (E GMP) మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్‌లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, షార్క్ పిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌లు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవెల్ 2 ADAS వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. హ్యుందాయ్ ఐయోనిక్5 కారులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ESC, 360 డిగ్రీ కెమెరా వంటివి మాత్రమే కాకుండా ఇందులో లేన్ ఫాలో అసిస్ట్, ఫార్వార్డ్ కొలిశాం వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








