నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

నేడు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం మొత్తం కాలుష్యానికి గురవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ మరియు డెవలప్మెంట్ అనే పేరుతో అడవులను నాసనమ్ చేస్తూ, ఫ్యాక్టరీలు నిర్మించడం వల్ల వాతావరణం ఊహకందని రీతిలో కాలుష్యానికి గురవుతుంది. ఇది మాత్రమే కాకుండా పెరుగుతున్న జనాభాతో వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది. వాహనాలవల్ల కూడా కాలుష్యం జరుగుతోంది.

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

ఇప్పుడిప్పుడే మనదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలుగా, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొంతమంది మేధావులలా తెలివితేటలవల్ల నీటితో నడిచే యంత్రాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఈ విధానగా నీటితో నడిజె ఇంజిన్ ని కనిపెట్టాడు ఒక యువ సైంటిస్ట్. దీని గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

బీహార్ రాష్ట్రంలోని కటియార్ జిల్లాకి చెందిన ఒక యువ సైంటిస్ట్ అయిన 'రిబమ్' నీటితో పనిచేసే ఇంజిన్ ని కనుగొన్నాడు. ఈ నీటితో నడిచే ఇంజిన్ వాళ్ళ పూర్తిగా వాతావరణానికి ఎటువంటి హాని జరగదు.

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

రిబమ్ తయారుచేసిన ఇంజిన్ శక్తిని పొందటానికి నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లకంటే శక్తివంతమైనది. అంతే కాకుండా ఇది వాతావరణానికి కాలుష్య కారకం కాదు.

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

రిబమ్ తాన చేసిన అద్భుత సృష్టి గురించి డిడి న్యూస్ ఛానల్లో వివరించారు. తానూ చేసిన పరిశోధనకు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికా వంటి దేశాలలో కూడా ప్రశంసించబడ్డాడు.

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

రిబమ్ చేసిన పరిశోధనలకు మెచ్చి అమెరికా ప్రభుత్వం తన ఉన్నత చదువుకు పూర్తి ఖర్చును భాద్యతలను భరిస్తామని తెలిపింది. ఈ యువ శాస్త్రవేత్త కూడా తన ఉన్నత చదువుకి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు.

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

రిబమ్ తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి క్లీన్ ఎనర్జీ ఫీల్డ్ తయారీ కోసం ప్రయతనాలు కొనసాగిస్తున్నాడు. ఈ ఇంజిన్ గురించి రిబమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది నీటితో నడిచే హైడ్రో కెమికల్ ఇంజిన్ అని చెప్పారు.

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

ఈ ఇంజిన్ గురించి తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ఉయోగించాలంటే ముందుగా నీటితో నింపాల్సి ఉంటుంది. ఈ విధంగా నీటిని నింపిన తరువాత ఇది శక్తిని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇంజిన్ వల్ల వాతావరణానికి ఎలాంటి హాని జరగదు.

నీటితో నడిచే ఈ ఇంజన్ డీజిల్, పెట్రోల్ ఇంజన్ల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని రిబమ్ చెప్పారు. ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేసినందుకు ఈ యువకున్ని చాల మంది అభినందించారు.

నీటితో నడిచే ఇంజిన్‌ను కనుగొన్న యువ సైంటిస్ట్

రిబమ్ చేసిన ఈ పరిశోధన ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరిని ఆకర్షించింది. రిబమ్ పరిశోధన ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పును తీసుకురానుంది. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పరిశోధన చేసిన రిబమ్ అభినందనీయుడు.

Most Read Articles

English summary
Young scientist from Bihar invents water fuel engine. Read in Telugu.
Story first published: Friday, February 28, 2020, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X