Just In
- 1 hr ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 4 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి
భారత దేశంలో రోజు రోజుకి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో పోలీసులు తనికీలు చేయడం మరింత ముమ్మరం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనదారులను పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది ఘరానా దొంగలు కూడా వెలుగులోకి వస్తారు. ఇలాంటి సంఘటనలు మనం ఇది వరకటి కథనాలాలో తెలుసుకుని ఉంటాము. ఇపుడు అదే తరహాలో కొంతమంది నేరస్థులు బయట పడ్డారు.

తాజా సమాచారం ప్రకారం, పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 65 మంది నేరస్థులను అరెస్టు చేసి జైలుకు పంపారు. దాదాపు నాలుగు గంటల ఇంటెన్సివ్ తనిఖీల తరువాత, పోలీసులు దొంగిలించిన కార్లను స్వాధీనం చేసుకున్నారు మరియు క్రిమినల్ నేపథ్యం ఉన్న అనేక మందిని అరెస్టు చేశారు.

చిక్కుకున్న నేరస్థులు మరియు వాహనాల నెంబర్ ని ట్రాక్ చేసే దేశవ్యాప్త నెట్‌వర్క్ వలె ఇది కనిపిస్తుంది. ఈ తనిఖీలు బీహార్‌లో జరిగాయి. 4 గంటల తనిఖీలో 65 మందిని అరెస్టు చేసి 67 దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న వారిలో భయాందోళనను సృష్టించింది.
MOST READ:ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

నిందితులు కిడ్నాప్, దోపిడీ వంటి వివిధ కేసులకు పాల్పడ్డారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేర వృత్తికి పాల్పడే వారిని గుర్తించి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇటీవలకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిలువరించడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు.

కేవలం నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో పోలీసులు పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్నారా అనే ప్రశ్న తలెత్తింది. పోలీసుల ఈ చర్యను ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.
MOST READ:నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

దీనికి సంబంధించిన సమాచారాన్ని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. అక్రమ రవాణా ద్వారా మద్యం బాటిల్స్, 3,570 లీటర్ల మద్యం, 159 కిలోల మందులను స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక తెలిపింది.

ఇవి మాత్రమే కాకుండా రూ. 92000 నగదు కూడా పట్టుకున్నారు. బీహార్‌లోని 38 జిల్లాల్లో జరిగిన తనికీలలో ఇవన్నీ కనుగొనబడ్డాయి. మన రాష్ట్రాల్లో కూడా ఈ తరహా ఆపరేషన్ చేయాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కారు ఓనల్రు దొంగల వల్ల చాలా ఇబ్బందిపడుతున్నారని తెలుస్తుంది. ఎన్ని లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించినప్పటికీ వాహన దొంగతనాలను నిలువరించలేకపోతున్నారు.
MOST READ:మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్.. ఇప్పుడు మరింత సూపర్ స్టైల్ గురూ!

ఇటీవల కాలంలో చాలామంది వాహన తయారీదారులు కొత్త టెక్నాలజీలతో ఆటోమొబైల్స్ తయారు చేస్తున్నాయి. దొంగిలించబడిన వాహనాలను ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రానికి అమ్మడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో రోడ్డుపైన సిసిటివిల కొరత ఉంది, మరికొన్ని ప్రాంతాలలో సిసిటివిలు సక్రమంగా నిర్వహించడం లేదు. ఇవన్నీ పోలీసుల పనితీరుపై ఆటంకం కలిగిస్తున్నాయి. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి వాహనాల్లో జిపిఎస్, నావిగేషన్ వాడాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.
MOST READ:సినిమా స్టైల్లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

వాహన దొంగతనాలను నివారించడానికి వాహనాలలో వీలైనంత కొత్త టెక్నాలజీలను ఉపయోగించాలి. ఇవన్నీ వాహనాలలో ఉపయోగించినట్లైతే దొంగలించిన తర్వాత సులభంగా గుర్తించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
Note: Images are representative purpose only.