రూ. 50 లక్షల ఖరీదైన కారు కొన్న యుట్యూబర్.. ఆ కారు ఏదో ఇక్కడ చూడండి

ప్రస్తుతం యుట్యూబ్ ప్రపంచాన్ని ఏలేస్తోంది.. అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంగటన జరిగినా వెంటనే యుట్యూబ్ లో ప్రత్యక్షమైపోతుంది. అలాంటి యుట్యూబ్ ద్వారా ఎంతోమంది మంచి సంపాదన చేస్తున్నారు. ఇటీవల ఒక యుట్యూబర్ 50 లక్షల ఖరీదైన కారుని కొనేసాడు.

ఈ ఆధునిక కాలంలో ఈ యుట్యూబ్ ద్వారా ఎంతో మంది సాధారణ ప్రజలు కూడా సెలబ్రిటీలుగా మారారు. మనం నిత్యజీవితంలో మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ని ఈ యుట్యూబ్ ద్వారా సెలబ్రిటీలుగా మారిన సంఘటనలు చూసే ఉంటాము. అయితే బీహార్ ఔరంగాబాద్‌లోని జసోయా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల 'హర్ష్‌ రాజ్‌ పుత్‌' కూడా ఈ కోవకు చెందిన వాడే. తాను యుట్యూబ్ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో మంచి సంపాదన చేస్తున్నాడు.

రూ. 50 లక్షల కారు కొన్న యుట్యూబర్

ఇటీవల హర్ష్‌ రాజ్‌ పుత్‌ యుట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఏకంగా రూ. 50 లక్షల ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరా అవుతున్నాయి. కరోనా మహమ్మరి సమయంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో హర్ష్‌ రాజ్‌ పుత్‌ ఉపాధి కోల్పోయాడు. అయితే ఆ తరువాత యూట్యూబ్‌ ఛానల్ స్టార్ట్ చేసి తనదైన రీతిలో అందరిని ఆకర్శించాడు.

హర్ష్‌ రాజ్‌ పుత్‌ యుట్యూబ్ ప్రారభించి 'ధాడక్' అనే న్యూస్ రిపోర్టర్ పేరుతో అనే రకాల సమస్యలపై కామెడీ చేసి నవ్వులు పోయిస్తున్నాడు. యుట్యూబ్ ప్రారభించిన కేవలం మూడు సంవత్సరాల్లో లక్షాధికారిగా మారిపోయాడు. అయితే ఇటీవలే యితడు ఒక ఖరీదైన ఆడి కారు ని కొనుగోలు చేసాడు. ప్రస్తుతం ఈ యువకుడు నెలకు రూ. 8 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. కరోనా సమయంలో స్వయం ఉపాధి ఏర్పరుచుకుని ఇప్పుడు లక్షాధికారిగా మారిపోయాడు.

రూ. 50 లక్షల కారు కొన్న యుట్యూబర్

హర్ష్‌ రాజ్‌ పుత్‌ ప్రజా సమస్యలపై సెటైరికల్‌గా వీడియోలు చేయడంతో అతి తక్కువ కాలంలోనే ఫెమస్ అయిపోయాడు. ఇప్పటికి ఇతని యుట్యూబ్ ఛానల్ కి సుమారు 33 లక్షల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. కేవలం మూడు సంవత్సరాల్లో ఇంత మంది సబ్‌స్క్రైబర్స్‌ ని పొందటం చిన్న విషయం కాదు. అయితే యితడు ఆడి కారు కొని పశువుల కొట్టం దగ్గర పార్క్ చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ ఫోటోలు చూసిన చాలామంది యుట్యూబ్ ద్వారా లక్షాధికారి అయినప్పటికీ తన ప్రొఫెషనల్ వర్క్‌ మాత్రం అలాగే కొనసాగిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా మనం పుట్టినప్పుడు మన పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు కానీ భవిష్యత్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. జువాలజీలో పిజి పూర్తి చేసిన హర్ష్‌ రాజ్‌ పుత్‌ 2020 సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లి అక్కడ ఒక థియేటర్ లో పని చేయడం మొదలు పెట్టి కరోనా వల్ల అది కూడా కోల్పోయాడు.

రూ. 50 లక్షల కారు కొన్న యుట్యూబర్

చదువు, బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా కరోనా లాక్‌డౌన్‌లో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిజంగానే హర్ష్‌ ఎందరికో ప్రస్తుతం ఎంతరికో రోల్ మోడల్ అయిపోయాడు. ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఇంటికి ఒక యుట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నత స్థాయికి ఎదిగి పోతున్నారు. గతంలో కూడా కొంత మంది యుట్యూబ్ స్టార్స్ ఖరీదైన బైకులు మరియు కార్లను కూడా కొనుగోలు చేశారు.

ఇక హర్ష్‌ రాజ్‌ పుత్‌ కొనుగోలు చేసిన ఆడి కార్ విషయానికి వస్తే, ఇది ఆడి ఏ4 అని తెలుస్తోంది. ఆడి ఏ4 మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అయితే హర్ష్‌ కొనుగోలు చేసిన ఈ కారు బ్లూ కలర్ లో ఉంది. ఇది మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా పనితీరు పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.ఇలాంటి మరిన్ని కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bihar youtuber buys rs 50 lakhs audi car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X