హఠాత్తుగా బట్టల షాప్​లోకి దూరిన బైక్.. ఇంతకీ ఏం జరిగింది: వీడియో చూడండి

మనం నిత్య జీవితంలో అనేక భయానక సంఘటనలు చూస్తూనే ఉంటాము. అది ప్రత్యక్షంగా కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు. ఇలాంటి సంఘటనలు చూడగానే ఒక రకమైన భయం మనల్ని ఆవహిస్తుంది. ఇలాంటి సంఘటనలను వర్ణించడం కూడా చాలా వరకు అసాధ్యమనే చెప్పాలి. అయితే ఇలాంటి ఒక భయంకరమైన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బట్టల షాప్​లోకి దూరిన బైక్.. ఇంతకీ ఏం జరిగింది: వీడియో చూడండి

నివేదికల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఖమ్మం నగరంలోని రావిచెట్టు బజార్‌లోని ఒక బట్టల దుకాణంలోకి ఒక ద్విచక్ర వాహనం దూసుకెళ్లి అక్కడివారిని భయభ్రాంతులను చేసింది. ఈ సంఘటన గత సోమవారం జరిగినట్లు తెలుస్తుంది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ జరిగిన సంఘటన సిసి టీవీ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన వీడియో కూడా అందుబాటులో ఉంది.

బట్టల షాప్​లోకి దూరిన బైక్.. ఇంతకీ ఏం జరిగింది: వీడియో చూడండి

దీనికి సంబంధించి వీడియో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఈడియోలో మీరు గమనించినట్లయితే, ఆ బట్టల దుకాణంలో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అందులో ఇద్దరు మహిళలు అక్కడ బట్టలు కొనడానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఆ బట్టల దుకాణం యజమాని వారికి బట్టలు చూపుతూ ఉన్నారు. ఇంతలో దుకాణంలోకి ఒక ద్విచక్ర వాహనం దూసుకొచ్చింది.

బట్టల షాప్​లోకి దూరిన బైక్.. ఇంతకీ ఏం జరిగింది: వీడియో చూడండి

బట్టల దుకాణంలోకి వచ్చిన ద్విచక్ర వాహనం బజాజ్ పల్సర్ గా గుర్తిచబడింది. బజాబ్ పర్సర్ దుకాణంలో ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు ఎగిరి కిందపడ్డాడు. కాలం అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. అంతే కాకుండా ద్విచక్ర వాహనదారుడితోపాటు దుకాణంలో ఉన్న ముగ్గురికి ఎలాంటి గాయాలు కాలేదు.

బట్టల షాప్​లోకి దూరిన బైక్.. ఇంతకీ ఏం జరిగింది: వీడియో చూడండి

దీనికి సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి బైక్‎ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విచారణలో పోలీసులు ఈ బైక్ కి బ్రేక్‎లు పెయిలవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్థారించారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చాలా భయానికి గురవవుతారు.

బట్టల షాప్​లోకి దూరిన బైక్.. ఇంతకీ ఏం జరిగింది: వీడియో చూడండి

హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన అక్కడి వారినే కాదు అందరిని ఒక్క సారిగా షాక్ కి గురి చేసింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే బజాజ్ పల్సర్ కి బ్రేకులు పెయిలవ్వడంతో ఈ ప్రమాదానికి కారణం అయ్యింది, ఈ ప్రమాదంలో బండి కొంత దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది.

సాధారణంగా రోడ్డుపై గాని హైవే పైన గాని వాహనానికి బ్రేకులు ఫెయిల్ అయితే ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో వాహనదారులకు బాగా తెలుసు, ఇది ప్రాణాలకే ప్రమాదం, కానీ ఇక్కడ బట్టల షాపులోకి దూసుకెళ్లిన బైక్ రైడర్ నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎటువంటి హాని కలగకుండా బయటపడగలిగాడు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా భయాన్ని కలిగిస్తూ ఉంటాయి.

బట్టల షాప్​లోకి దూరిన బైక్.. ఇంతకీ ఏం జరిగింది: వీడియో చూడండి

వాహనం యొక్క ముఖ్యమైన భాగాలలో బ్రేకులు చాలా ప్రధానమైనవి, కావున వాహనదారులు వాహనాన్ని తీసే ముందుగానే బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా అని నిర్దారించుకోవాలి. ఒక వేళా అనుమానం కలిగితే వెంటనే రిపేర్ షాప్ కి తీసుకెళ్లాలి. లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతుంది. కావున వాహనదారులందరూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలి.

Most Read Articles

English summary
Bike crash into clothing store telangana video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X