హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారణం కేవలం ట్రాఫి రూల్స్ పాటించకపోవడం మాత్రమే కాదు, నిర్లక్ష్యమైన వాహన రైడింగ్ కూడా. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే ఒక వాహనదారుడు చేసే తప్పిదానికి ఇతరులు ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

ఈ వీడియోలో బైక్ రైడర్ చేసిన పొరపాటుకు రెండు లారీలు భయంకరంగా ఢీ కొట్టుకోవడం గమనించవచ్చు. డ్రైవర్ రోడ్డుపై దృష్టి పెడితే ప్రమాదాలు జరగవు. అనుకోకుండా ఏదైనా వాహనదారులకు అడ్డుగా వస్తే అప్పుడు అతడు వాహనంపై నియంత్రణ కోల్పోతాడు.

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

కానీ కొన్ని సందర్భాలలో బైక్‌లు మరియు చిన్న వాహనాలను నియంత్రించవచ్చు. కానీ వేగంగా వెళ్లే ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాలను నియంత్రించడం అనేది అంత సులభం కాదు. అలా నియంత్రణ కోల్పోయినప్పుడు ప్రమాదాలు సాధారణంగా జరుగుతాయి.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

నివేదికల ప్రకారం గత సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో తీవ్రమైన రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబధించి సిసిటివి వీడియో ఈ ప్రమాదానికి గల కారణాన్ని చూపిస్తుంది. ఈ వీడియోలో బైక్ రైడర్ మరియు లారీ డ్రైవర్ ఇద్దరిది తప్పు అని చూపిస్తుంది.

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

ఇలాంటి రోడ్డుపైకి ప్రజలు తరచుగా వస్తూ ఉంటారు. కావున లారీ డ్రైవర్స్ కొంత జాగ్రత్తగా రోడ్డుపై దృష్టిపెట్టి డ్రైవింగ్ చేయాలి. లారీ డ్రైవర్ కొంత నెమ్మదిగా వచ్చినట్లైతే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఆ సమయంలో బైకర్ రావడం వల్ల బైకర్ ని తప్పిచడానికి లారీని కుడివైపుకు తిప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు.

MOST READ: మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

ఇక్కడ ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడు బైక్ రైడర్. రహదారిని దాటడానికి ప్రయత్నించిన బైక్ రైడర్ తన కుడి వైపున వచ్చే లారీని గమనించలేదు. బైక్ రైడర్ రహదారిపై శ్రద్ధ చూపకపోవడంతో ఈ భయంకర ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో బైక్ రైడర్ ఎటువంటి ప్రమాదానికి గురికాలేదు.

ఈ ప్రమాదం ఉదయం జరగటం వల్ల రెండు లారీలు తప్ప వేరే వాహనాలకు నష్టం జరగలేదు. కానీ ఈ రెండు లారీల డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘోర ప్రమాదానికి కారణమైన బైకర్‌ను, అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దుచేసి అతన్ని అరెస్టు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

ఒకవేళ సిసిటివి వీడియో లేకుండా ఉంటే ఈ ప్రమాదానికి అసలు కారకులెవరు అని గుర్తించేది కష్టమయ్యేది. కానీ సిసి టివి వీడియో కారణంగా ప్రధానికి కారణమైన వారిమీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా రోడ్డుమీద ప్రయాణించేవాహనాలు ముందు వెనుక కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అప్పుడే ప్రమాదాలు కొంతవరకు నివారణ అవుతాయి.

Most Read Articles

English summary
Bike rider responsible for massive accident in Hyderabad. Read in Telugu.
Story first published: Thursday, April 1, 2021, 11:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X