మరో జంట ఫొటో క్లిక్‌మనిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా.. నెటిజన్ల కామెంట్లు చూడాల్సిందే..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) ఆధారిత కెమెరాలను కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం మే నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 726 AI కెమెరాలను అమర్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన నుంచి ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు (Kerala Artificial intelligence Camera) అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 50 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అయితే కొన్నిసార్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు తప్పుగా చలాన్లు జారీచేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ కెమెరాలు తీసిన ఓ ఫోటో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ జంట హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై ప్రయాణం చేస్తోంది. ఫలితంగా AI కెమెరా ఫొటో తీసింది. అయితే ఆశ్చర్యకరంగా స్కూటర్ రైడర్ కెమెరాలకు థ్యాంక్స్ చెప్పడం గమనార్హం.
కామెంట్లు హైలెట్ : ఫేస్‌బుక్ పేజీ snp వ్లాగ్‌లో ఈ వీడియో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టు కింద రైడర్ కోణంలో రాసుకొచ్చారు. 'థ్యాంక్యు కేరళ MVD, ఉహించని క్లిక్, నా తల్లి ఫోన్ నంబర్‌కు పంపినందుకు ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఘటన కేరళలో ఎక్కడ జరిగిందనే కచ్చితమైన సమాచారం. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియో ఆధారంగా ఓ యువతియువకుడు హోండా డియో స్కూటర్‌పై ప్రయాణం చేస్తున్నారు. అయితే రైడర్ సహా వెనుక కూర్చున్న యువతి కూడా హెల్మెట్ ధరించలేదు. అయితే వారిద్దరి చేతిలోనూ హెల్మెట్‌లు కనిపించలేదు. అయితే స్కూటర్ వెనుక సీట్లో కూర్చున్న యువతి రైడర్ గర్ల్ ఫ్రెండ్‌గా నెటిజన్లు భావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు.. కుమారుడి గర్ల్‌ఫ్రెండ్ వివరాలు అధికారికంగా అతని తల్లికి తెలియజేశాయి.. అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్ హైలెట్ : మరో నెటిజన్ మరింత ఆసక్తికర కామెంట్ చేశారు. రైడర్, అతని గర్ల్‌ఫ్రెండ్‌కు పెళ్లి కుదిరితే.. తప్పకుండా రవాణా శాఖ అధికారులను ఆహ్వానించాలని, వీరిద్దరి ఫొటో తీసిన ఆర్టిఫిషియల్ ఇంటెజిలెన్స్ కెమెరా అమర్చిన పోల్ ఆశీర్వాదం తీసుకోవాలంటూ కామెంట్ చేశాడు.
కొన్నిరోజుల క్రితం కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఓ జంట రొమాంటిక్ ఫొటోను క్లిక్‌మనిపించాయి. ఎంత డబ్బులిచ్చినా.. ఫోటోగ్రాఫర్లు ఇంత మంచి ఫోటో తీయలేరంటూ గతంలో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ ఫోటోకు 500 జరిమానా విధిస్తే మాత్రం ఏమైంది.
ఓ గొప్ప ఫోటోగ్రాఫర్ కూడా ఇంత అద్భుతంగా ఫోటో తీయలేకపోవచ్చు. AI కెమెరా ఈ ఫోటోను కలర్ ఫోటోగా తీసి ఉంటే ఎంతో బాగుంటుందని.. తన ఇంట్లో శుభకార్యం కోసం ఇలాంటి ఫోటోను ఉపయోగిస్తా.. అని ఫోటో క్యాప్షన్ కింద రాసుకొచ్చారు.
కేరళలో మోటార్‌సైకిల్ పై హెల్మట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తారు. అదే బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తే రూ.1000, డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడితే రూ.2000 జరిమానా విధిస్తారు. కేరళలో ఏర్పాటుచేసిన AI కెమెరాలు.. ఎటువంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కనిపించినా వెంటనే ఫోటో తీసి, డేటా సెంటర్‌కు పంపిస్తాయి. ఎంత రాత్రి సమయంలోనైనా ఈ హై రిజల్యూషన్ కెమెరాలు ఫోటోలు తీయగలవు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.232 కోట్లు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. 726 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను రాష్ట్ర, జాతీయ రహదారులపై ఏర్పాటుచేసింది. ఈ కెమెరాలు అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఈ కెమెరాల పనితీరుపై గతంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








