Just In
- 20 min ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్ను ఓపెన్ చేసిన బాష్
- 1 hr ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 15 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- 15 hrs ago
షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?
Don't Miss
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- News
ఈ అనారోగ్య సమస్యలు ఉంటే కోవాక్సిన్ తీసుకోకండి .. భారత్ బయోటెక్ హెచ్చరిక
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి
సాధారణంగా జంతువులవల్ల అప్పుడప్పుడు వాహనదారులు అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాహనదారులు జంతువుల వల్ల ఎదుర్కొన్న ప్రమాదాలను గురించి మీరు ఇదివరకటి కథనాలతో తెలుసుకుని వుంటారు. ఇప్పుడు ఇదే తరహాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

జంతువులకు కోపం వచ్చిప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో మనం ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో, మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరినీ ఒక ఆవు గుద్దటం ఇక్కడ చూడవచ్చు.

బైక్ పై వచ్చిన యువకులు చాలా అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ ఆవు ఎదురుగా ఉన్న పెట్టెను గుద్దింది. ఈ సంఘటన జరిగినప్పుడు గ్యాస్ స్టేషన్ వద్ద ఎవరూ లేకుండా ఉండటం వీడియోలో చూడవచ్చు.
MOST READ:జనవరి 1 నుండి పెరగనున్న రెనో కార్ల ధరలు; డిసెంబర్ ఆఫర్లు

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి. గ్యాస్ రీఫిల్లింగ్ దగ్గర ఉద్యోగి లేదా మరెవరైనా గ్యాస్ స్టేషన్ వద్ద ఉంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. పొడవటానికి వచ్చిన ఆవు నుండి యువకులు తప్పించుకోగలిగారు.

ఆవు అప్పటికే చాలా కోపంగా ఉండటంతో యువకులు తప్పించుకోవడంతో అది సరాసరి ఎదురుగా ఉన్న పెట్టెను డీ కొట్టింది. ఈ ఆవు అక్కడ ఉన్న పెట్టెను కాకుండా గ్యాస్ స్టేషన్ ని గుద్దినట్లయితే నిజంగా పెద్ద విపత్తు జరిగి ఉండేది.
MOST READ:మైండ్‌తో కంట్రోల్ చేయగల నిస్సాన్ కాన్సెప్ట్ కార్ ; పూర్తి వివరాలు

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా ధృవీకరించబడలేదు. కానీ పశువుల కారణంగా వాహనదారులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం.

కోపంతో పశువులు ఎక్కడ, ఎప్పుడు దాడి చేస్తాయో అనటానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనం. అంతేకాకుండా పశువులు దాడి చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలో అనటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
MOST READ:మహిళా రైడర్స్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ ; వివరాలు
భారతదేశంలోని రోడ్లపై పశువుల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. పశువులను రోడ్ల నుండి దూరంగా ఉంచడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటిని పూర్తిగా నిలువరించలేకపోతోంది.

పశువులు కొన్ని చోట్ల రోడ్లపై తిరుగుతూ ఉంటాయి. ఈ కారణంగా వాహనదారులు హైవేలపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మనకు స్పష్టంగా తెలియకపోయినా అన్ని రోడ్లు మరియు ప్రదేశాలకు వర్తిస్తుంది. కావున వాహనదారులు చాలా జాగరూకగా ఉండాలి.
MOST READ:అప్పుడే హ్యాక్ చేయబడిన HSRP అధికారిక వెబ్‌సైట్ ; తర్వాత ఏం జరిగిందంటే