కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

భారతదేశంలో మోటార్ వాహన చట్టం చాలా కఠినంగా ఉంది. దీనికి ప్రధాన కారణం దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తెగ్గించడమే, అయితే దేశంలో ఎన్ని కఠినమైన నియమాలు అమలులో ఉన్నప్పటికీ కొంతమంది వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అలాంటి వారికి పోలీసులు సరైన గుణపాఠం చెబుతున్నారు.

ఇటీవల కేరళలో ఒక బైక్ రైడర్ తన బైకుతో చేసిన విన్యాసాలకుగాను డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోయాడు, అంతే కాకుండా పోలీసులు ఆ బైకును స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

నిజానికి ప్రజాదరహదార్లలో బైక్ స్టంట్స్ చేయడం నేరం, కావున అటువంటివారిపైనా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన జిష్ణు అనే వ్యక్తి తన బైకుతో ఒళ్ళు గగుర్లు పుట్టే విన్యాసాలను చేసాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సిసిల మీడియాలో వైరల్ అయ్యింది.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

ఈ వీడియోను మనోరమ న్యూస్ ఛానల్ తమ యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. దీనిపైన పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగానే 'కేరళ ఎంవిడి' (Kerala Motor Vehicles Department) ఆ బైక్ రైడర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేసింది.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

వీడియోలో కనిపించే జిష్ణు అనే వ్యక్తి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియోలో అతడు ఒక స్కూల్ గ్రౌండ్ లో బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో కూడా పోలీసులు అతన్ని పట్టుకుని బహిరంగ రహదారులపై ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అతడు పోలీసులకే సవాలు విసిరినట్లు బైక్ స్టంట్స్ చేసి మళ్ళీ కలకలం రేపాడు.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

జిష్ణు కేరళలో ఉన్న ప్రముఖ బైక్ స్టంటర్లలో ఒకడు, కావున ఇతనికి సోషల్ మీడియాలో అనేక మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల స్టంట్స్ చేసిన బైక్ కూడా స్టంట్స్ చేయడానికి అనుకూలంగా కస్టమైజ్ చేసుకున్నాడు. కావున ఇది కూడా చట్టవిరుద్ధమే.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

ఈ బైకులో ట్యాంక్ గ్రిప్ లు, పిలియన్ కూర్చునే సీటులో కూడా కొన్ని మార్పులు జరిగాయి. అంతే కాకుండా మాడిఫైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ మరియు హ్యాండిల్ బార్ వంటివి కూడా ఇక్కడ గమనించవచ్చు. మోటార్ సైకిల్ యొక్క రియర్ టైర్ హగ్గర్ మరియు నెంబర్ ప్లేట్ మౌంట్ కూడా పూర్తిగా తొలగించబడ్డాయి. మోటార్ సైకిల్ మీద మాత్రం ఒక చిన్న నంబర్ ప్లేట్ ఉంది. మొత్తం మీద ఇది చట్టవిరుద్ధంగా రూపొందించబడిందని తెలుస్తోంది.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

ప్రొఫెషనల్ బైక్ స్టంటర్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన జిష్ణు యొక్క మోటార్ సైకిల్ RC ని రద్దు చేయడానికి కేరళ ఎంవిడి ఆలోచిస్తోంది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవడం వల్ల పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించడానికి చూస్తున్నారు.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

గతంలో కూడా ప్రజా రహదారులపైన స్టంట్స్ చేసిన వారికి చాలామందికి పోలీసులు భారీగా జరిమానాలు విధించడమే కాకూండా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పూర్తిగా రూపుమాపడానికి తగిన చర్యలు మరింత కఠినంగా ఉండాలి.

బైక్ స్టంట్స్ చేయడం చాలామందికి ఫ్యాషన్ అయి ఉండవచ్చు, ఈ స్టంట్స్ లో అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రాణాలే పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి విన్యాసాలు పబ్లిక్ రోడ్డుమీద జరిగితే అది రోడ్డుపైన ఉన్న ఇతరులకు కూడా ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కావున బైక్ స్టంట్స్ చేయాలనుకునేవారు ఏదైనా ప్రయివేట్ స్థలాల్లో మాత్రమే చేసుకోవాలి.

కళ్ళు తిరిగే బైక్ స్టంట్స్, కట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్: వీడియో వైరల్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రపంచంలో ఎక్కువ రోడ్డుప్రమాదాలు జరిగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటని ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అయితే వీటి కారణాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందులో ఈ బైక్ స్టంట్స్ కూడా ఒకటి. ఈ బైక్ స్టంట్స్ పబ్లిక్ రోడ్లపైన చేస్తే అది కేవలం వారికి మాత్రమే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ప్రమాదాన్ని తీసుకువస్తుంది. కావున బైక్ స్టంట్స్ చేయాలనుకునే వారు పబ్లిక్ రోడ్లమీద చేయకూడదు. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి.

More from DriveSpark

Article Published On: Friday, October 21, 2022, 16:23 [IST]
English summary
Bike riders license cancelled for mocking kerala mvd by performing stunt against warning details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+