బైక్‌ ట్యాక్సీ రైడర్లు ఎగిరి గంతేసే న్యూస్‌.. చట్ట బద్ధం చేసే యోచనలో కేంద్రం.. పూర్తి వివరాలివే.!!

టెక్నాలజీ, ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ దేశంలో బైక్ టాక్సీ సేవలను ఉపయోగించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల నుంచి ఫిర్యాదుల ద్వారా బైక్ టాక్సీపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కొన్ని రాష్ట్రాల్లో బైక్‌ ట్యాక్సీ సర్వీసులు తగ్గాయి. కాగా ఇటీవల బైక్ టాక్సీలను నిషేధించిన రెండు ప్రధాన రాష్ట్రాల్లో తిరిగి వాటికి అనుమతి లభించనుంది.

ఆటో, క్యాబ్‌ల తర్వాత బైక్‌ ట్యాక్సీ(Bike Taxis)లు మన రోజువారీ ప్రయాణంపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. సింగిల్‌ ప్రయాణికులు తమ డబ్బును ఆదా చేసుకునేందుకు బైక్‌ ట్యాక్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంతో బైక్‌ ట్యాక్సీ రైడర్లు గత కొంతకాలంగా కొన్ని చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. వారికి ఇప్పుడు ఉపశమనం లభించింది.

Bike-Taxi-Legal

దేశ రాజధాని ఢిల్లీతో సహా భారతదేశంలోని ప్రధాన నగరాల్లో కొన్నేళ్ల క్రితం బైక్ ట్యాక్సీలను పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో బైక్‌ ట్యాక్సీ(Bike Taxis Legal) సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఓలా, ర్యాపిడో, ఉబర్‌ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే దేశంలో బైక్ టాక్సీ సేవలను అందిస్తున్నాయి. కాగా కొన్ని ప్రధాన నగరాల్లో బైక్‌ ట్యాక్సీ సర్వీసులు నిలిచిపోయాయి.

ఈ పరిస్థితిలో, బైక్ ట్యాక్సీల(Bike Taxis Delhi And Maharashtra)ను నిషేధించిన ఢిల్లీ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో బైక్ టాక్సీ సేవలను తిరిగి అనుమతించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) భారత్‌లో బైక్ టాక్సీ సేవలను చట్టబద్ధం చేయాలనే ప్రతిపాదనను అందించింది.

Bike-Taxi-Legal

దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇండియన్ మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 2(7) ప్రకారం, కాంట్రాక్ట్ వాహనాల నిర్వచనంలో మోటార్ సైకిళ్లను చేర్చినట్లు పేర్కొంది. అంటే మోటార్ సైకిళ్లను ప్రజా రవాణాకు వాహనంగా కూడా ఉపయోగించవచ్చని నివేదిక చెబుతోంది.

ఈ నివేదికను అనుసరించి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో బైక్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వనున్నట్లుగా మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బైక్ ట్యాక్సీ సేవలను అందించడానికి కార్పొరేట్ సంస్థల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తాయని MoRTH భావిస్తోంది.

Bike-Taxi-Legal

దీంతో పాటు బైక్‌ ట్యాక్సీ పరిశ్రమలో ద్విచక్ర వాహన నిర్వాహకులు ఎదుర్కొంటున్న డ్రైవింగ్‌ లైసెన్సుల సమస్యలకు పరిష్కారం చూపే పనిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీ మరియు మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలకు నిషేధం ఉన్నప్పటికీ.. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ మరియు గోవా వంటి ఇతర ప్రధాన భారతీయ రాష్ట్రాల్లో బైక్ ట్యాక్సీలు సేవలు అందిస్తున్నాయి.

దేశంలో బైక్ టాక్సీ సేవల్లో రాపిడో 60 శాతం వాటాను కలిగి ఉండటంతో.. సగానికి పైగా బైక్ టాక్సీ సేవలను Rapido అందిస్తుండటం విశేషం. నివేదికల ప్రకారం ర్యాపిడో ప్రతిరోజూ 10 లక్షల కంటే ఎక్కువ బైక్ ట్యాక్సీ రైడ్‌లను యాక్సెప్ట్‌ చేస్తోంది. ఈ మేరకు ఈ సేవలను చట్టబద్ధం చేసే యోచనపై రాపిడో సహ వ్యవస్థాపకుడు స్వాగతించారు.

Bike-Taxi-Legal

ర్యాపిడో, ఉబర్‌, ఓలా వంటి కొన్ని ట్యాక్సీ అగ్రిగేటర్లు.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించే అవకాశం ఉండటంతో కొత్త కంపెనీలు పరిశ్రమలోకి రావడానికి సుముఖత చూపించడం లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి రిపోర్ట్ రావడంతో బైక్ ట్యాక్సీ రంగంలోకి కొత్త స్టార్టప్ కంపెనీలు అడుగుపెట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 29, 2024, 9:45 [IST]
English summary
Bike taxis will became legal in these states check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+