బైక్‌బోర్డ్స్ సాయంతో సైకిల్‌పై సైతం స్కీయింగ్ చేయొచ్చు!
సైకిల్‌తో ఎవరైనా మంచుపై స్కీయింగ్ చేయగలరా..? స్కీయింగ్ బోర్డ్స్‌తో మంచుపై స్కేటింగ్ గురించి విన్నాం కానీ సైకిల్‌తో మంచుపై స్కీయింగ్ ఏంటి, చిత్రంగా ఉందే అనుకుంటున్నారా..? అవును మానవుడు తలచుకుంటే సాధ్యం కానిదేముంది..!
ఇది కూడా చదవండి: పౌల్ వాకర్ మళ్లీ బ్రతికొచ్చాడు..
ఇదిగో ఈ ఫొటోల్లో చూడండి.. స్కీయింబ్ బోర్డులను సైకిల్ చక్రాలకు కదలకుండా బిగించేసి, నేరుగా సైకిళ్లతోనే స్కీయింగ్ చేస్తున్నారు వీరంతా.. అంతేకాదు, ఇలా సైకిళ్లతో స్కీయింగ్ రేసుల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ ప్రత్యేకమైన స్కీయింగ్ బోర్డులను 'బైక్బోర్డ్స్' అని పిలుస్తారు.
ఈ బైక్ స్కీయింగ్ బోర్డులకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఇవి ఎలా పనిచేస్తాయో తెలిపే వీడియోను ఈ ఫొటో ఫీచర్‌లో వీక్షించండి.

ఈ బైక్‌బోర్డులను ప్రత్యేకంగా సైకిళ్లకు అమర్చేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఎలాంటి సైకిళ్లకైనా అమరే విధంగా వీటిని తీర్చిద్దారు. ఈ బైక్‌బోర్డును సైకిల్ యొక్క రెండు చక్రాలకు అమర్చరు, కేవలం ముందు చక్రానికి మాత్రమే అమర్చుతారు.

సైకిల్ ముందు చక్రం నుంచి ఈ బైక్‌బోర్డ్ జారిపోకుండా ఉండేందుకు వీలుగా దీనిని ఓ జా పిన్, మౌంటింగ్ బ్రాకెట్, బూట్ స్ట్రాప్స్ మరియు బ్రేక్ స్ట్రాప్స్‌తో లాక్ చేస్తారు. ఫలితంగా ముందు టైరు కదలకుండా స్థిరంగా ఉంటుంది. వెనుక టైరు మాత్రమే కదులుతుంది. (అవసరం లేదనుకున్నప్పుడ అన్‌లాక్ చేసుకోవచ్చు).

సైకిల్ ముందు చక్రానికి ఈ బైక్ బోర్డును అమర్చుకోవటం చాలా సులువు. అంతేకాదు, చాలా త్వరగా దీనిని ఫిక్స్ చేసుకోవచ్చు కూడా. ఈ జా పిన్స్ మూడు సైజుల్లో అందుబాటులో ఉంటాయి (టైర్లను బట్టి ఫిక్స్ చేసుకునేందుకు వీలుగా).

ముందు టైరు కదలకుండా స్థిరంగా ఉంటుంది (బ్రేక్‌లను కూడా లాక్ చేస్తాం) కాబట్టి స్కీయింగ్ చేసేటప్పుడు సైకిల్ వేగాన్ని తగ్గించాలన్నా లేదా సైకిల్‌ను నిలపాలన్నా వెనుక బ్రేక్‌లపై ఆధారపడాల్సిందే.

ఈ బైక్‌బోర్డ్స్ మూడు రంగులలో (గ్రీన్, బ్లాక్, గ్రీన్ అండ్ బ్లాక్) లభిస్తాయి. వీటి ప్రారంభ ధర 375 డాలర్లు (మనదేశ కరెన్సీలో రూ.22,000 లకు పైమాటే).
బైక్ స్కీయింగ్‌ను చూపించే వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications