Viral Video: ఇద్దరమ్మాయిలతో బైక్ పై 'స్టంట్స్'.. చివరకు చిక్కాడు.. బొక్కలో వేశారు..!
ఇటీవల రోడ్లపై బైక్స్ పై స్టంట్స్ చేయడం యువతకు బాగా అలవాటైపోయింది. ఇదే అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా కొంతమంది యువత అత్యుత్సాహంతో చెలరేగిపోతున్నారు. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
అలాంటి సంఘటనే ముంబైలోని పబ్లిక్ రోడ్డుపై జరిగింది. ఈ సారి ఓ బైకర్ చేసిన స్టంట్స్ ప్రయాణికులను ఆశ్చర్యానికి లోనుచేసింది. ముందు ఒక అమ్మాయి వెనక ఓ అమ్మాయిని కూర్చోబెట్టుకుని తను చేసిన విన్యాసాలు నోటికి వేలు వేసుకునేలా చేసింది. మోటారు సైకిల్‌పై ఇద్దరు అమ్మాయిలతో బీకేసీ(బాంద్రా కుర్లా కాంప్లెక్స్) రోడ్డులో రైడర్ స్టంట్స్ కెమెరాలో చిక్కాయి.

ట్యాంక్ పై ఒకరు, పిలియన్ పై మరొకరితో..
సామాజిక కార్యకర్త ముస్తాక్ అన్సారీ ఈ స్టంట్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ముంబైలోని పబ్లిక్ రోడ్లపై ఎలాంటి రక్షణ కవచం లేకుండా ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న బైకర్ల వీడియోలను అన్సారీ పోస్ట్ చేశారు. ఒక మహిళ ఇంధన ట్యాంక్‌పై కూర్చొని, మరొకరు పిలియన్‌పై కూర్చుండగా రైడర్ ముందు వీల్ ని పైకి లేపుతున్న విన్యాసాలు వీడియోలో గమనించవచ్చు.
వీడియో వైరల్ కావడంతో, ముంబై పోలీసులు BKC పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు. ఈ ముగ్గురిపై IPCసెక్షన్ 279 (రాష్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్), సెక్షన్ 336 (మానవ ప్రాణాలకు లేదా ఇతరుల భద్రతకు హాని తలపించడం) సెక్షన్ 114 (ప్రేరేపణ) కింద అలానే మోటారు వాహన చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అరెస్ట్..
ఆ రైడర్ ని అదే ప్రాంతానికి చెందిన ఫైయాజ్ అహ్మద్ అజ్జెముల్లా ఖాద్రీగా గుర్తించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 8 దీక్షిత్ గెడ్మాన్ తెలిపారు. బైక్ పై విన్యాసాలు ప్రదర్శించిన వ్యక్తి కేవలం 24 సంవత్సరాలు మాత్రమేనని ఆయన వెల్లడించారు. ఇతనిపై గతంలో కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు.
అతనిపై గతంలో వాడాలా ట్రక్ టెర్మినస్ పోలీస్ స్టేషన్‌తో పాటు ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. పోలీసులకు దొరకకుండా అతను అడ్రస్ మార్చుకుంటూనే ఉన్నాడని DCP తెలిపారు. ప్రస్తుతం అతను నివసిస్తున్న సకినాకాలోని చిరునామా ఆధారంగా ట్రాక్ చేసినట్లు చెప్పారు. అనంతరం ఫైయాజ్ అహ్మద్ అజ్జెముల్లా ఖాద్రీ అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

'అందుకే వీడియో పోస్ట్ చేశా..'
తదుపరి విచారణ జరుగుతోందని DCP గెడ్మాన్ చెప్పారు. వీడియోను అప్‌లోడ్ చేసిన అన్సారీ పేరును ట్రాఫిక్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సమాచారం మూలం(ప్రైమరీ సోర్స్)గా నమోదు చేశారు. ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని DCP తెలిపారు. ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
ఖాద్రీని అతని మునుపటి నేర రికార్డుల ఆధారంగా అరెస్టు చేసి ఉంటారని సామాజిక కార్యకర్త ముస్తాక్ అన్సారీ పేర్కొన్నారు. పోలీసులు ఇలాంటి స్టంట్‌మెన్‌లను కఠినంగా శిక్షించాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి విన్యాసాల కారణంగా వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడ్డారు. వీటి నివారణకు పోలీసులు ఇతర మార్గాలను రూపొందించాలని ఆయన సూచించారు.
చట్టరీత్యా నేరం..
బహిరంగ రహదారులపై విన్యాసాలు చేయడం చట్టవిరుద్ధం, దానిని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష విధించవచ్చు. అటువంటి కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం అనేక ఇబ్బందులకు దారితీయవచ్చు. విన్యాసాలు లేదా వీడియోలను రికార్డ్ చేయడానికి, రేస్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి ప్రైవేట్ ఆస్తిని ఎంచుకోవాలి. ఈ తరహా విన్యాసాలు అత్యంత ప్రమాదకరమని గమనించడం అవసరం.
ఈ రోజుల్లో మెట్రోపాలిటన్ ప్రాంతాలు సమగ్ర CCTV నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి, దీనిని చట్ట అమలు అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. వీటిని ఉల్లంఘించినచో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ట్రాక్ చేయడం ద్వారా చలాన్లు జారీ చేస్తారు. అయినప్పటికీ, అనేక ఆన్‌లైన్ చలాన్‌లు తప్పుగా ఉన్న నంబర్ ప్లేట్ల కారణంగా కొందరు తప్పించుకుంటున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజాగా ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలపై రుసుమును పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








