పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

భారతదేశంలో రోజురోజుకి సూపర్ బైకులు సంఖ్య ఎక్కువవుతోంది. దీన్ని బట్టి చూస్తే సూపర్ బైకుల ప్రేమికులు ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. బైక్ ప్రేమికులు ఎక్కువైతే ప్రమాదం లేదు, అయితే ఈ బైక్‌లపై స్టంట్స్ చేయడం మాత్రం చాలా ప్రమాదానికి దారితీస్తుంది.

పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

ఇటీవల కాలంలో యువత ఎక్కువగా బైక్ స్టంట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి బైక్ స్టంట్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగా పోలీసులు వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒక యువకుడు కొంత ధైర్యం చేసి ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట బైక్ స్టంట్స్ చేసాడు.

పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

నివేదికల ప్రకారం కేరళలో ఒక యువకుడు ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు బైక్ స్టంట్స్ చేసినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ ముందు బైక్ స్టంట్స్ కి పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆగక పోలీసులు అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.

MOST READ:కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

సరైన రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా బీచ్ రోడ్‌లో బైక్ స్టంట్స్ కేసులు రావడం కేరళలో ఇదే మొదటిసారి కాదు. అయితే ఇప్పుడు పట్టుబడ్డ అతడికి పోలీసులు జరిమానా విధించిన తరువాత బైక్‌ను విడుదల చేశారు. ఆ యువకుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్ కోసం ఒక చిన్న వీడియోను తయారు చేశారు.

పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

ఈ వీడియోలో ఆ యువకుడు పోలీస్ స్టేషన్ ముందు కూడా బైక్ స్టంట్స్ చేయడం చూడవచ్చు. దీనిపై మనోరమ న్యూస్ ఛానల్ నివేదికను వెల్లడించడంతో పాటు వీడియోను వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. యువకుడు చేసిన బైక్ స్టంట్స్ వీడియో అతి తక్కువ సమయంలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఎక్కువ వైరల్ అయ్యింది.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

ఈ వీడియోను కేరళ పోలీసు సోషల్ మీడియా టీమ్ గుర్తించింది. వారు వీడియో చూసిన వెంటనే బైక్ స్టంట్స్ కి కారణమైన యువకుడిని, బైక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేరళ పోలీసులు కూడా ఇలాంటి ట్రోల్ వీడియోను తయారు చేశారు, ఆ యువకుడు తన బైక్‌ను నెట్టివేసి పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లోకి ప్రవేశించినట్లు చూడవచ్చు.

పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

మోటారు వాహన విభాగం కూడా రైడర్ పై చర్యలు తీసుకుంది. యువకుడు చేసిన ఈ చర్య వల్ల డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా సస్పెండ్ చేయబడింది. వీడియోలో కనిపించే బైక్ KTM RC200 అయి ఉంటుందని భావిస్తున్నాము. ఈ వీడియోలో, మోటారు వాహనాల శాఖకు చెందిన ఒక అధికారి ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ట్రాక్ చేయడానికి సోషల్ మీడియాలో నిఘా ఉంచారని చెప్పడం వినవచ్చు.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

దీని సహాయంతో నంబర్ ప్లేట్ లేకపోయినా, స్థానికుల సహాయం తీసుకొని వాహనం యజమానిని గుర్తించవచ్చని వారు వివరించారు. అంతే కాకుండా రోడ్డుపై ఇలాంటి కార్యకలాపాలకు కారణమైన వారిని సిసి కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకోవచ్చని కూడా వారు తెలిపారు.

పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

బైక్ స్టంట్స్ చేసిన వారిని మాత్రమే కాకుండా సిసిటివిల సహాయంతో, హెల్మెట్ లేని మోటార్‌సైకిలిస్టులను మరియు మితిమీరిన వేగంతో వెళ్లే వాహనదారులను పోలీసులు గుర్తిచడానికి ఉపయోగిస్తారు. వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే కఠినమైన శిక్షలకు గురికావడం మాత్రమే కాకుండా జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తుంది.

MOST READ:కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజెన్ కూడా ఉంది!

Image Courtesy: Manorama News

Most Read Articles

English summary
KTM Rider License Suspended For Stunting In Front Of A Police Station. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X