బైక్‌కు ఎదురుగా సింహం.. తర్వాత ఏం జరిగిందంటే?.. భయపెడుతున్న వీడియో

అసలే చీకటి.. గాఢాంధకారం, చేతిలో దీపం లేదు.. గుండెల నిండా ధైర్యం ఉందనే మాటలు చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దాదాపు ఎలాంటి ధైర్యవంతుణ్ణి అయినా భయపెడుతుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక బైకర్ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఎదురుగా అనుకోని అదితి 'సింహం' కనిపించింది. 23 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో చూడగానే ఎవరికైనా ఒకింద భయం పుడుతుంది. కానీ బైకర్ మాత్రం ఏ మాత్రం భయానికి గురి కాకుండా.. బైక్ మీదనే కూర్చుని వెనుక ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో రెడ్డిట్‌లోషేర్ చేయబడింది.

Biker Meets Lion At Night Time

వీడియోలో మాట్లాడుకుంటున్న వ్యక్తులకు సింహం ఎదురుగా వస్తున్నప్పటికీ.. బైకును ఆప్ చేయకంగా హెడ్ లైట్ కూడా ఆన్ చేసుకునే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీరు హీరో స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సింహం కూడా వీరికి దగ్గరగా వచ్చి.. అటువైపుగా ఉన్న గోడ దూకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత వారు అక్కడ నుంచి ముందుకు వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది.

సింగిల్ లేన్ రోడ్డు మీద ఈ సఘనత జరిగింది. కాబట్టి బైకర్ ముందుకు వెళ్లలేకపోయారు. అదృష్టవశాత్తు సింహం వారిని ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. దీంతో అక్కడివారు ఊపిరి పీల్చుకోగలిగారు. ఈ ఘటన గుజరాత్ ప్రాంతంలోని సింహాల ఉనికికి ప్రసిద్ధి చెందిన గిర్ నేషనల్ పార్క్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో సింహాలు తిరుగుతూ కనిపించడం ప్రజలకు కొత్తేమీ కాదని తెలుస్తోంది.

Biker Meets Lion At Night Time

నిజానికి ఆ ప్రాంతంలో సింహాలు మనుషులను చూస్తూనే ఉంటాయి. అయితే మనుషుల మీద దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువని సమాచారం. ఎందుకంటే అక్కడి ప్రజలు సింహాలను కూడా మచ్చిక చేసుకుంటారు. కాబట్టి మనుషుల మీద సింహాల దాడులు చాలా అరుదు. అయినప్పటికీ గత రెండు సంవత్సరాల కాలంలో సింహళ దాడి వల్ల 7 మంది తెలుస్తోంది. ఎక్కువగా పశువుల మీద దాడి చేస్తాయని చెబుతుంటారు.

వాహనదారులకు సింహాలు, పులులు వంటి క్రూర జంతువులు ఎదురుపడినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే జంతువు దాడి చేసే అవకాశం ఉంది. జంతువులూ సున్నితంగా ఉంటాయి కాబట్టి.. మనుషుల కదలికలు వాటికి భయాన్ని కలిగించవచ్చు. ఆ సమయంలో వాటి ఆత్మ రక్షణ కోసం దాడికి దిగే అవకాశం ఉంది. ఇక్కడ వీడియోలో బైకు మీద ఉన్న వ్యక్తులు మాట్లాడుకోవచ్చు చూడవచ్చు. నిజానికి వారి చర్య ప్రమాద హేతువు.

Biker Meets Lion At Night Time

జంతువులు కనిపించినప్పుడు వాహనాల యొక్క హారన్ (సౌండ్) కొట్టడం వంటివి అస్సలు చేయకూడదు. ఆ శబ్దం జంతువులకు కోపాన్ని తెప్పిస్తాయి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ జంతువులు మన మీద దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భయంతో ఏ చిన్న పొరపాటు చేసినా ఊహకందని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీటిని ప్రజలు గుర్తుంచుకోవాలి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, March 18, 2024, 9:55 [IST]
English summary
Biker meets lion at night time video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+