Accident CCTV Visual బైక్‌పైకి దూసుకెళ్లిన కంటైనర్.. సీసీటీవీ వీడియో వైరల్..

ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసు అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. డ్రైవింగ్‌పై అవగాహన లోపం, నిర్లక్ష్య డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం తదితర కారణాల ద్వారా ప్రాణ నష్టం సంభవిస్తోంది.

సాధారణంగా రహదారులపై పెద్ద, చిన్న వాహనాలు ఢీకొని ప్రమాదం సంభవించినప్పుడు.. పెద్ద వాహనం నడుపుతున్న డ్రైవర్‌దే తప్పుగా ప్రాథమిక నిర్ధారణకు వస్తామనడంలో సందేహం. కానీ ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం మారుతుంది. వాహనం చిన్నదైనా పెద్దదైనా డ్రైవింగ్‌ సరిగా చేయకపోతే జరిగే అనర్థాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

Accident CCTV Visual

పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదం దీనికి అద్దం పడుతోంది. పటియాల లైవ్‌ న్యూస్‌ ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను షేర్‌ చేసింది. అప్పటివరకూ సాఫీగా ప్రయాణం సాగుతున్న ఆ రోడ్డుపై ఒక్క క్షణంలో అంతా తలకిందులై పోతుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పంజాబ్‌లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై మహిళతో పాటు రోడ్డుకు ఎడమవైపుగా ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో బైక్‌ పక్కగా లారీ, భారీ కంటైనర్‌ సవ్య దిశలోనే వస్తున్నాయి. ఈ క్రమంలో జంక్షన్‌ వద్దకు రాగానే అకస్మాత్తుగా బైకర్‌ కుడివైపునకు టర్న్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో అతను కంటైనర్‌ను గమనించకపోవడంతో అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది.

Accident CCTV Visual

బైకర్‌ సడెన్‌గా కుడివైపునకు మళ్లడంతో.. ఇది ఊహించని కంటైనర్‌ డ్రైవర్‌ బైక్‌ను ఢీకొట్టాడు. అనంతరం కంటైనర్‌ కుడివైపునకు దూసుకెళ్లింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ ఎదురుగా ఉన్న నేమ్‌ బోర్డు కిందకు దూసుకెళ్లారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు అప్రమత్తమై సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో బైకర్‌ తప్పు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది.

కంటైనర్ జంక్షన్‌ నుంచి కుడి వైపునకు దూసుకెళ్లిన అనంతరం నేమ్‌ బోర్డును ఢీ కొట్టింది. దీంతో అక్కడ కూర్చున్న ఇద్దరూ భయంతో ముందుకు పరుగులు తీశారు. బైక్‌ కూడా నేమ్‌ బోర్డు కిందకు దూసుకెళ్లడంతో ఇద్దరూ కింద పడ్డారు. అదృష్టవశాత్తు బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ఏది ఏమైనా రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కొన్ని కీలకమైన అంశాలు తెలుసుకోవడం అవసరం. డ్రైవింగ్‌ చేసేటప్పుడు కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. లేదంటే అనుకోని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

బైక్‌ నడుపుతున్నప్పుడు స్థిరంగా ప్రయాణించాలి. లైన్‌ మారేటప్పుడు లేదా మలుపులు తిరిగేటప్పుడు ముందూ వెనకా వస్తున్న వాహనాలను తనిఖీ చేసుకోవాలి. ట్రాఫిక్‌ నియమాలు, నిబంధనలు పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా హెల్మెట్‌ పెట్టుకోవడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు రహదారి భద్రతా మార్గదర్శకాలను పాటిస్తూ భద్రతకు ప్రాధాన్యమివ్వాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 27, 2023, 14:16 [IST]
English summary
Biker reckless driving causes accident in punjab cctv visual gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+