19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్‌డౌన్ సడలించడం వల్ల ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటికి రావడం ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీసులు తమ బైక్‌లపై స్టంట్ చేస్తున్న దాదాపు 100 మంది బైకర్లను అరెస్టు చేశారు. ఇప్పుడు గురుగ్రామ్ పోలీసులు 19 స్టంట్ రైడర్లకు జరిమానా విధించి బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

చాలా ప్రాంతాలలో ఈ బైక్ రేసులు జరగటం మనం చూస్తూనే ఉంటాము. ఈ రేసులు వల్ల చాల ప్రమాదాలు సంభవిస్తాయి. అంతే కాకుండా వాహనదారులకు మరియు రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు కూడా ఇబ్బందులను కలిగిస్తాయి.

19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

గురుగ్రామ్ లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ తొలగించబడింది. ఈ కారణంగానే బైకర్లు బైక్‌ల స్టంట్ చేయడం ప్రారంభించారు. లాక్‌డౌన్ ఓపెన్ చేసిన తరువాత, రైడర్స్ బృందం ఒకటి విన్యాసాలు చేయడానికి పాల్పడ్డారు. బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడినందుకు వారికి జరిమానా విధించబడింది.

MOST READ:బిఎస్ 6 బజాజ్ సిటి 100 కొత్త ధరలు & ఇతర వివరాలు

19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

గురుగ్రామ్ యొక్క డిసిపి రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనదారులు నివ్వెరపోయారు. డీసీపీ వెంటనే పోలీసు సిబ్బందిని అక్కడికి పంపించారు. ఈ బైక్‌లను స్వాధీనం చేసుకోవడంలో డీసీపీ నాయకత్వం వహించారు.

19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

ఇందులో చాలా బైక్‌లు ఖరీదైనవే. చాలా బైక్‌లు సుజుకి హయాబుసా బైక్‌లు. మోటారు వాహన చట్టం 2019 ప్రకారం పోలీసులు రూ. 17,000 జరిమానా విధించారు. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు మొత్తం 19 బైక్‌లను పోలీసుల అధీనంలో ఉంటాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : పాకిస్థాన్‌లో తలెత్తిన కొత్త సమస్య

గురుగ్రామ్‌లోని సెక్టార్ 53 పోలీస్ స్టేషన్‌ వారు ఈ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు గణనీయంగా పెరిగాయని పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో రోడ్లు ఖాళీగా ఉన్నందున కొంతమంది బైక్ రైడర్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇది రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు భయాన్ని కలిగిస్తుంది.

19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

ఈ బైక్‌లన్నీ గోల్ఫ్ కోర్సు రహదారి నుండి జప్తు చేయబడ్డాయి. ప్రతి బైక్‌ ధర దాదాపు రూ. 6 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. బైక్ రైడర్స్ గోల్ఫ్ కోర్సు రహదారి చుట్టూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తారు. ఈ ఖరీదైన బైకులన్నీ గురుగ్రామ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

MOST READ:2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఉపకరణాలను వెల్లడించిన టయోటా

Most Read Articles

English summary
Bikers fined for performing stunts, 19 bikes seized by Gurugram police. Read in Telugu.
Story first published: Thursday, June 11, 2020, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X