అంబానీ గ్యారేజిలో చేరిన మరో రోల్స్ రాయిస్ కారు - ధర ఎంతో తెలుసా?
ప్రముఖ పారిశ్రామికవేత్త.. భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. వేలకోట్ల సంపద కలిగిన అంబానీ, వారి ఫ్యామిలీ ఖరీదైన అన్యదేశ కార్లు ఉపయోగిస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పటికే వీరి గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, బెంట్లీ, బీఎండబ్ల్యూ మరియు లంబోర్ఘిని మొదలైన సుమారు 168 లగ్జరీ, సూపర్ కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల ముకేశ్ అంబానీ మరో రోల్స్ రాయిస్ కారును తమ గ్యారేజిలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియో కూడా నెట్టింట్లో చెక్కారు కొడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
ఇటీవల ముకేశ్ అంబానీ గ్యారేజిలో చేరిన రోల్స్ రాయిస్.. 9వ కల్లినన్ అని తెలుస్తోంది. అంటే ఇప్పటికే వీరి గ్యారేజిలో ఎనిమిది రోల్స్ రాయిస్ కల్లినన్ కార్లు ఉన్నాయని అర్థమవుతోంది. వీడియో ప్రారంభంలో ముంబై రోడ్లపై అనేక సూపర్ కార్లు మరియు స్పోర్ట్స్ కార్లను చూడవచ్చు. ఆ తరువాత అంబానీ సరికొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. వీడియో రాత్రి సమయంలో రికార్డ్ చేసినట్లు స్పష్టమవుతోంది.

వీడియోలో కేవలం రోల్స్ రాయిస్ కల్లినన్ మాత్రమే కాకుండా మహీంద్రా స్కార్పియో, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ జీ63 ఏఎంజీ వంటి కార్లు వారి కాన్వాయ్ ముందు భాగంలో రావడం చూడవచ్చు. అంబానీ కాన్వాయ్‌లో ఖరీదైన కార్లు ఉన్నాయని గతంలో కూడా తెలుసుకున్నాం. కాన్వాయ్‌లో లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా వెళ్లడం చూడవచ్చు.
వీడియోలో గమనిస్తే అంబానీ తొమ్మిదవ రోల్స్ రాయిస్ కల్లినన్ పెబుల్ పారడిసో షేడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కుటుంబానికి చెందిన కొన్ని కల్లినన్ కార్లు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో అనంత్ అంబానీ దుబాయ్‌లో షాపింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు భద్రతా వాహనాలతో పాటు కల్లినన్ కారుతో కనిపించారు. దీన్ని బట్టి వీరికి విదేశాల్లో కూడా రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఒక్క రోల్స్ రాయిస్ కారు కొనటమే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకుంటే వీటి ధరలు కోట్లలో ఉంటాయి. అలాంటిది అంబానీ ఫ్యామిలీ ఏకంగా తొమ్మిది కొన్నదంటే.. ఇక వారికి రోల్స్ రాయిస్ బ్రాండ్ మీద ఎంత ప్రేమ ఉంది, వారి వద్ద ఇంకెంత డబ్బు ఉంటుందనేది కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు తొమ్మిది రోల్స్ రాయిస్ కార్లు కలిగిన భారతదేశంలోనే లేదని తెలుస్తోంది.
కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన అంబానీ ప్రస్తుతం ఆసియాలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అంబానీ తొమ్మిదవ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ 6.75 లీటర్ ట్విన్ టర్బో వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 600 Bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
అంబానీ రోల్స్ రోయ్స్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ.10 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ కారుకు తిరుగే లేదు. కాబట్టి చాలామంది ధనవంతులు ఈ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేస్తారు. అయితే అంబానీ ఫ్యామిలీకి మాత్రం రోల్స్ రాయిస్ బ్రాండ్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ కారణంగానే వారు ఎప్పటికప్పుడు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








