యూసఫ్ అలీ కారులో రజనీకాంత్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (వీడియో)

ఇండియన్ సూపర్ స్టార్ రజనికాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఎన్నెన్నో కష్టాలు పడి.. ఈ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డారు. ఇటీవల రజనీకాంత్ ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న తరువాత నటుడు రజనీకాంత్.. బిలినీయర్ 'ఎమ్ఏ యూసఫ్ అలీ' ఇంటికి వెళ్లారు. ఆ తరువాత వీరిరువురు (రజనీకాంత్, యూసఫ్ అలీ) రోల్స్ రాయిస్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను యూసఫ్ అలీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

యూఏఈలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఎమ్ఏ యూసఫ్ అలీ.. అనేక మాల్స్ మరియు హైపర్ మార్కెట్‌లను కలిగి ఉన్నారు. భారతదేశంలోని చాలా ప్రధాన నగరాల్లో కూడా ఆయనకు మాల్స్ ఉన్నాయి. ఈయన లులు గ్రూప్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అలీ నటుడు రజనీకాంత్‌ను పక్కన కూర్చోబెట్టుకుని రోల్స్ రాయిస్ కలినన్ కారును డ్రైవ్ చేశారు.

MA Yusuff Ali and Superstar Rajnikanth in Rolls Royce

ఈ వీడియోలో అబుదాబిలోని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి తెల్లటి రోల్స్ రాయిస్ కల్లినన్ కారులో అలీ, రజనీకాంత్ ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. యూసఫ్ అలీ స్వయంగా కారును డ్రైవ్ చేస్తుండగా.. రజనీకాంత్ కో డ్రైవర్ సీటులో కూర్చుని ఉండటం చూడవచ్చు. యూసఫ్ అలీ.. రజనీకాంత్‌ను అబుదాబిలోని తన నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ వారు సంభాషించుకున్నట్లు సమాచారం.

మనం గతంలో బిలినీయర్ యూసఫ్ అలీ ఖరీదైన కార్లను గురించి తెలుసుకున్నాం. అయితే కారులో ఎప్పుడూ అలీ వెనుక కూర్చుని ఉండగా.. డ్రైవర్స్ కారును డ్రైవ్ చేస్తారు. కానీ రజినీకాంత్ కోసం యూసఫ్ అలీ స్వయంగా కారును డ్రైవ్ చేశారు. బహుశా తన రోల్స్ రాయిస్ కారును తానే(యూసఫ్ అలీ) డ్రైవ్ చేయడం ఇదే మొదటిసారి కావొచ్చు. ఈ వీడియో అటు రజిని, ఇటు అలీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.

MA Yusuff Ali and Superstar Rajnikanth in Rolls Royce

ఇక్కడ కనిపించే రోల్స్ రాయిస్ చాలా అద్భుతంగా ఉండటం చూడవచ్చు. వీటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. మన దేశంలో కూడా అంబానీ ఫ్యామిలీ, అదానీ, కుమార్ మంగళం బిర్లా మరియు చిరంజీవి మొదలైనవారు రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో రోల్స్ రాయిస్ కార్ల వినియోగం మనదేశంతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

రోల్స్ రాయిస్ కలినన్ మంచి డిజైన మరియు అత్యాధునిక లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తాయి. దీనికోసం కంపెనీ ఈ కలినన్ కారులో 6.75 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చింది. ఇది 569 Bhp పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. ఈయన భారతదేశంలో అత్యంత ధనిక నటులలో ఒకరు. రజనీకాంత్ సంపన్నులైనప్పటికీ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారు. అయితే కార్లు మాత్రం అత్యంత ఖరీదైన మరియు అన్యదేశ్య కార్ల ఆయన గ్యారేజిలో ఉన్నాయి. కానీ ఎప్పుడూ టయోటా ఇన్నోవా వంటి సాధారణ కార్లలోనే తిరగటానికి ఇష్టపడతారు. కాబట్టి ఎక్కువసార్లు రజనీకాంత్ సాధారణ కార్లలోనే కనిపిస్తుంటారు.

గతంలో.. చాలా రోజులకు ముందు రజనీకాంత్ ఫెరారీ కారు డ్రైవ్ చేస్తూ కనిపించారు. అంతే కాకుండా చెన్నై వీధుల్లో లంబోర్ఘిని కారు డ్రైవ్ చేస్తూ కూడా కనిపించరు దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో స్వయంగా రజినీకాంత్ కారు డ్రైవ్ చేయడం చూడవచ్చు. అయితే ఈ సూపర్ కార్లలో రజినీకాంత్ కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 30, 2024, 12:30 [IST]
English summary
Billionaire lulu mall owner ma yusuff ali and superstar rajnikanth in rolls royce
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+