వేలకోట్ల సంపద.. నానో కారులో ప్రయాణం!.. ఇతనెవరో తెలుసా?

'టాటా నానో' కారు అనగానే మధ్య తరగతి లేదా అంతకంటే కింద ఉన్న వారు ఉపయోగించేదని చాలామంది భావిస్తారు. నానో (Nano) కారును కుబేరులు కూడా ఉపయోగిస్తారని ఓ బిలినీయర్ నిరూపించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. ప్రముఖ వ్యాపారవేత్త మరియు ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'రాజేష్ హీరానందని' (Rajesh Hiranandani) రెడ్ కలర్ టాటా నానో కారులో రావడం చూడవచ్చు. ఈ వీడియోను స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Rajesh Hiranandani Spotted in Tata Nano

వీడియోలో రాజేష్ హీరానందని.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ ప్రవేశ ద్వారా దగ్గర.. టాటా నానో కారును ఉంచి వాలెట్‌తో మాట్లాడుతుండటం చూడవచ్చు. ఆ తరువాత రసీదులాంటిది తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడం చూడవచ్చు. వేలకోట్ల సంపదకు అధినాయకుడైన రాజేష్ హీరానందని.. సాధారణ నానో కారులో రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈయన సింప్లిసిటీ ఎంతోమందిని ఫిదా చేస్తోంది.

నిజానికి చాలామంది ధనవంతులు కూడా రోజువారీ వినియోగానికి టాటా నానో లేదా తక్కువ ధరకు లభించే కార్లను ఉపయోగిస్తారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కూడా నానో కారును కలిగి ఉన్నారు. ఇది ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న కస్టమ్ బిల్డ్ ఎలక్ట్రిక్ కారు. రతన్ టాటా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ నానో కారును మార్కెట్లో లాంచ్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Rajesh Hiranandani Spotted in Tata Nano

టాటా నానో తక్కువ ధర వద్ద లభించే.. నగర ప్రయాణానికి ఉత్తమమైన కారు. అయితే దేశీయ మార్కెట్లో ఉత్తమమైన అమ్మకాలు పొందలేకపోవడం వల్ల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసింది. అయినప్పటికీ.. అక్కడక్కడా రోడ్ల మీద నానో కార్లు కనిపిస్తూనే ఉన్నాయి. రాజేష్ హీరానందని ఈ కారుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ కారులో ఏముంది అనే క్యాప్షన్ ఇచ్చారు.

టాటా నానో కారు ఒకప్పుడు భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టించింది. తక్కువ ధరతో.. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు 600 సీసీ ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 37 Bhp పవర్ మరియు 51 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

టాటా నానో కారు.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కారు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికాలేదు. కానీ రతన్ టాటా ఇప్పటికే కస్టమ్ ఎలక్రిక్ కారును ఉపయోగిస్తున్నారు, కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

బిలినీయర్ రాజేష్ హీరానందని కేవలం నానో కారు మాత్రమే కాకుండా.. ఇతర అన్యదేశ్య కార్లను కలిగి ఉన్నారు. అయితే టాటా నానో కారును కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే వినియోగించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కోట్ల సంపద కలిగిన హీరానందని అతి తక్కువ ధరకు లభించే నానో కారును ఉపయోగిస్తుండటం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇది ఎంతోమందికి ఆదర్శం కూడా.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, April 5, 2024, 9:07 [IST]
English summary
Billionaire rajesh hiranandani spotted in tata nano car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+