స్పైస్‌ కింగ్‌ వద్ద బోలెడన్నీ సూపర్‌ లగ్జరీ కార్లు.. 'అన్ని బండ్లు ఎందుకురా బుజ్జి' అంటున్న నెటిజన్లు!!

కేరళకు చెందిన బిలియనీర్ "స్పైస్ కింగ్" డాక్టర్ విజు జాకబ్ గ్యారేజీలో సరికొత్త ఫెరారీ రోమా సూపర్ కారును వచ్చి చేరింది. సింథైట్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న జాకబ్ ఈ సూపర్ కారు ధర అక్షరాల రూ.3 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌) ధర. ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఆయన షేర్ చేశారు. ఈ కొత్త ఫెరారీతో పాటు అతని గ్యారేజీలో భారీ సంఖ్యలో లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో మెర్సిడెస్ మేబ్యాచ్‌ GLS 600, పోర్షే పనామెరా మరియు ఇతర సెడాన్‌ కార్లు ఉన్నాయి.

తాజాగా ఆయన ఫెరారీ రోమా కారుని కొనుగోలు చేశారు. ఈ సూపర్ లగ్జరీ కారు పక్కన నిలబడి ఉన్న వీడియోను ఆయన షేర్‌ చేశాడు. నా జీవితంలోకి వచ్చిన మరో కొత్త చేరికను పరిచయం చేస్తున్నానని వీడియోలో ఆయన చెప్పుకొచ్చాడు. ఇది కేవలం కారు మాత్రమే కాదు, 1950 మరియు 60 ల కాలంలో రోమ్‌లో ఆహ్లాదకరమైన జీవనశైలికి నిదర్శనమని ఆయన తెలిపాడు.

Spice-King-Ferrari-Cars-Collection

క్లాసీ సిల్వర్ షేడ్‌లోని అతను ఫెరారీ రోమాను జాకబ్‌ ఎంచుకున్నాడు. దీని బయట డిజైన్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. దీని ఇంటీరియర్ చాలా ప్రత్యేకమైనది. బ్లాక్‌ స్టిచ్చింగ్‌తో కూడిన ఎల్లో ఇంటీరియర్‌తో మంచి లుక్‌ని అందించనుంది. ఫెరారీ రోమా 2019 నవంబర్‌లో ఆవిష్కరించబడింది. ఈ సూపర్ కార్ 3.9-లీటర్ ట్విన్-టర్బోఛార్జ్డ్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 612bhp పవర్ మరియు 760nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ రోమా కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, షార్క్-నోస్ ఫ్రంట్ ఫాసియా, కర్వ్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, అధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో అధునాతన ఇంటీరియర్ ఉన్నాయి. ఫెరారీ రోమాతో పాటు, డాక్టర్ విజు జాకబ్ భారీ అల్ట్రా-లగ్జరీ కార్లు మరియు ఎస్‌యూవీలను కలిగి ఉన్నారు.

Viju-Jacob-Ferrari-Roma-Car

ఆయన ఇటీవలే సరికొత్త 2024 రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును కొనుగోలు చేశాడు. ఈ ఎస్‌యూవీని శాంటోరిని బ్లాక్ షేడ్‌లో ఫినిష్ చేశారు. ఇందులోని 3.0-లీటర్ వి6 డీజల్ ఇంజిన్ 255 bhp పవర్ మరియు 600nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 5.0-లీటర్ వి8 సూపర్ ఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్ 518 bhp పవర్ మరియు 625 nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జాకబ్‌కు బీఎండబ్ల్యూ M340I సెడాన్ కూడా ఉంది. బీఎండబ్ల్యూ 3 సిరీస్ యొక్క ఈ హై-పెర్ఫార్మెన్స్ వేరియంట్ టర్బోఛార్జ్డ్‌ ఇన్ లైన్-సిక్స్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 382 bhp మరియు 500 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వైట్ కలర్‌లో ఫినిష్ చేసిన ఈ సెడాన్ కారును ఇతను కొనుగోలు చేశాడు.

Viju-Jacob-Cars-Collection

తన సేకరణలో స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. అతను సరికొత్త బీఎండబ్ల్యూ 2 కాంపిటీషన్‌ని కలిగి ఉన్నాడు. ఈ కూపే స్పోర్ట్స్ కారు ఆరెంజ్‌ కలర్‌ స్పోర్టీ షేడ్‌లో ఫినిష్ చేయబడింది. అంతే కాకుండా రూ.3.5 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాచ్‌ GLS 600 కారు కూడా ఉంది. ఇంకా బీఎండబ్ల్యూ 7 సిరీస్‌లోని లేటెస్ట్ జనరేషన్ మోడల్ ఆయన దగ్గర ఉంది. ఇది బ్లాక్ కలర్‌ ఫినిషింగ్‌తో వస్తుంది.

BMW XM, ఏకైక పోర్షే పనామెరా S.911 4-డోర్ల వెర్షన్ అద్భుతమైన స్పోర్ట్స్ సెడాన్‌గా ఉంది. ఇది వి6 ఇంజిన్ గరిష్టంగా 440bhp పవర్ మరియు 550 nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెడాన్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇంకా మరెన్నో కారులో ఆయన గ్యారేజీలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, June 16, 2024, 7:50 [IST]
English summary
Billionaire spice king dr viju jacob buys new ferrari roma luxury car and his cars collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+