కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

వాహనదారులందరికి సాధారణంగా డీజిల్ మరియు పెట్రోల్ గురించి ఎక్కువ తెలుసు. అయితే బయో డీజిల్ వంటి వాటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. బయో డీజిల్ అనేది వివిధ రకాలుగా ఉత్పత్తి చేస్తారన్న సంగతి తెలిసిన విషయమే, అయితే దాదాపు ఏడు సంవత్సరాల నిరీక్షణ తరువాత, కేరళ వెటర్నరీ డాక్టర్ 'జాన్ అబ్రహం' పౌల్ట్రీ వ్యర్థాల నుండి బయో డీజిల్‌ తయారు చేసి దానిపై పేటెంట్ కూడా కైవసం చేసుకున్నాడు.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

జాన్ అబ్రహం తయారు చేసిన ఈ బయో డీజిల్ లీటరుకు ఏకంగా 38 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని తెలిపాడు. బయో డీజిల్ సాధారణ డీజిల్ కంటే 40% తక్కువ ధరకు లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ బయో డీజిల్ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని కూడా అంటారు.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

ఏడు సంవత్సరాల నిరంతర కృషి తరువాత పౌల్ట్రీ వ్యర్థాల నుండి బయో డీజిల్ ఉత్పత్తి చేయడానికి ఇండియన్ పేటెంట్ కార్యాలయం పేటెంట్ జారీ చేసింది. ఈ నెల జూలై 7 న పేటెంట్ జారీ చేశారు. ఈ బయోడీజిల్‌ను కేరళ వెటర్నరీ మెడికల్ యూనివర్శిటీలోని వయనాడ్ వెటర్నరీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ అబ్రహం కనుగొన్నారు.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

ఈ ఆవిష్కరణ తమిళనాడు వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని నామక్కల్ యొక్క వెటర్నరీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ తో అనుసంధానించబడి ఉండటం గమనార్హం. జాన్ అబ్రహం 2009 నుంచి 2012 వరకు చేసిన పరిశోధన ఫలితంగా ఈ బయోడీజిల్‌ తయారైంది.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

ఈ పరిశోధన కోర్సు తరువాత, కేరళలోని వయనాడ్ లోని వెటర్నరీ మెడిసిన్ కాలేజీలో చేరాడు. దీని ఆధారంగా భారత్ పెట్రోలియం కొచ్చి డివిజన్ ఈ బయో డీజిల్ ధృవీకరణ పత్రాన్ని ప్రదానం చేసింది. అప్పుడు ఈ బయోడీజిల్ ద్వారా కాలేజీ వాహనం నడపబడింది.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

జాన్ అబ్రహం మరియు అతని ముగ్గురు విద్యార్థులు ఇప్పుడు పంది వ్యర్థాల నుండి బయోడీజిల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. బయోడీజిల్ ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. బయో డీజిల్ శాకాహార నూనె వాసన కలిగి ఉంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు అమ్మకానికి ఉన్న డీజిల్ లాగా కనిపిస్తోందని జాన్ అబ్రహం చెప్పారు.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

అతి తక్కువ ధరకే లభించే ఈ బయో డీజిల్ వాహనాల యొక్క మైలేజ్ పెంచడంలో ఉంపయోగపడుతుంది. కావున ఇప్పుడు అధిక ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులు ఎంతగానో సంతోషపడుతున్నారు. ఈ బయో డీజిల్ వల్ల వాతారవరణంలోకి ఎలాంటి కర్బన పదార్థాలు వెలువడవు. కావున వాతావరణ కాలుష్యం కూడా జరిగే ప్రమాదం లేదు.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

భారతదేశంలో డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మరియు చాలా రాష్ట్రాల్లో లీటరుకు డీజిల్ ధర ఇప్పుడు 100 రూపాయలు దాటేసింది. భారతదేశ ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి బయో డీజిల్ సహాయం చేస్తుంది.

కోడి వ్యర్థాల నుంచి బయోడీజిల్.. లీటరుకి 38 కి.మీ మైలేజ్, ధర కూడా చాలా తక్కువ

భారతదేశంలో ముడి చమురు దిగుమతుల పరిమాణాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్‌జి వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ బయో డీజిల్ వినియోగంలోకి వస్తే వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kerala Vet Doc Gets Patent For Biodiesel From Chicken Waste. Read in Telugu.
Story first published: Wednesday, July 28, 2021, 12:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X