బీటెల్ కారును సొంతం చేసుకున్న బిపాషా బసు

బిపాషా కొనుగోలు చేసిన బీటెల్ కారుకు “MH 02 CK 700" అనే నెంబర్‌ను సొంతం చేసుంది. భారత్‌లో లభ్యమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారు 2.0 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉండి 5400 ఆర్‌పిఎమ్ వద్ద 116 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 320 ఆర్‌పిఎమ్ వద్ద 172 ఎన్ఎమ్‌ల టార్క్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.
తొలిసారిగా బీటెల్ కారును 1938లో పరిచయం చేశారు. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన మూడో తరానికి చెందిన బీటెల్‌ను కంపెనీ ఇటీవలే న్యూయార్క్‌లో విడుదల చేసింది. 1998వ సంవత్సరంలో "ది న్యూ బీటెల్" అనే పేరుతో సెకండ్ జనరేషన్ బీటెల్‌ను ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న బీటెల్ రెండవ తరానికి చెందినది.
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో ఈ కారును విడుదల చేశారు. ఆ సమయంలో దీనిని ఫోక్స్‌వ్యాగన్ అని, "ప్రజల కారు" (పీపుల్స్ కార్) అని పిలిచేవారు. అంటే ప్రస్తుతం మనం ఫోక్స్‌వ్యాగన్‌గా చెప్పుకునే కంపెనీ పేరు ఒకప్పుడు బీటెల్ కారు పేరు అన్నమాట. భారత మార్కెట్లో బీటెల్ కారు ధర సుమారు రూ.20 లక్షలకు పైమాటే.


Click it and Unblock the Notifications