సెగ్‌వే పిటిలను ఇండియాకు తీసుకువచ్చిన బర్డ్ గ్రూప్
విలక్షణ నటుడు కమల్ హాసన్ 'దశావతారం' సినిమాలో ఉపయోగించిన సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్ గుర్తుందా..? అదేనండి, ఈ సినిమాలో విదేశాల్లో సైంటిస్ట్‌గా పనిచేసే కమల్ హాస్ ల్యాబోరేటరీలో రెండు చక్రాలు కలిగిన వాహనంపై అటూ ఇటూ తిరుగుతుంటాడు.. గుర్తొచ్చిందా..? ఇప్పుడు ఆ వాహనాలు మన దేశంలో కూడా లభ్యమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ ట్రావెల్, టెక్నాలజీ, రీటైల్ కంపెనీ 'బర్డ్ గ్రూప్'కు చెందిన 'బర్డ్ సెగ్‌వే' యూరోపియన్ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బ్యాటరీ పవర్డ్ సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ (పిటి) టూవీలర్‌ను ఇండియన్ మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్లు, పార్కులు, బీచ్‌లు, కొండలు వంటి ప్రాంతాల్లో ఎక్కువ దూరం నడిచే వారి నడకను తగ్గించేందుకు వినూత్న టెక్నాలజీతో డిజైన్ చేయబడిన సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లు ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చాయి.
సెల్ఫ్ బ్యాలెన్సింగ్ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్ వాహనాల తయారీలో గ్లోబల్ లీడర్ అయిన సెగ్‌వే ఐఎన్‌సితో బర్డ్ గ్రూప్ చేతులు ఇండియన్ మార్కెట్లో ఈ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లను అందిస్తుంది. ఇండియాలో బర్డ్ సెగ్‌వే బ్రాండ్‌తో లభిస్తున్నాయి. వీటి అధునాతన టెక్నాలజీ, డిజైన్‌లతో పాటుగా ఎకో ఫ్రెండ్లీ, జీరో ఎమిషన్, ఎనెర్జీ ఎఫీషియంట్ క్వాలిటీస్ కారణంగా ఇవి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.
సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లు కేవలం సాధారణం ప్రయాణం కోసం మాత్రమే కాకుండా, విమానాశ్రయాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, టూరిజం, పోలీస్ పెట్రోలింగ్ వంటి ప్రయోజాల కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కువ దూరం నడవటం ఇష్టం లేని వారు ఈ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లను ఉపయోగించి సులువుగా తమ గమ్యాలను చేరుకోవచ్చు. సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లు లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా పనిచేస్తాయి.
సెగ్‌వే సెల్ఫ్-బ్యాలెన్స్‌డ్ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లను నడపటం చాలా సులువు. పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లను ముందుకు లేదా వెనకు మూవ్ చేయాలంటే దానిపై ఉండే రైడర్ కొద్దిగా ముందుకు లేదా వెనకకు వంగి కదలిక చేస్తే సరిపోతుంది. ఇక కుడివైపుకు లేదా ఎడమవైపుకు తిరగాలంటే, స్టీరింగ్ ఫ్రేమ్‌ను కుడివైపుకు కానీ లేదా ఎడమవైపుకు కానీ స్వల్పంగా వంచితే సరిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది మోషన్ సెన్సార్ల ఆధారంగా, రైడర్ కదలికలను బట్టి ముందుకు, వెనకు, కుడి వైపుకు ఎడమ వైపుకు తిరుగుతుందన్నమాట.
సెగ్‌వే పిటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 38 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు (i2 మోడల్ మాత్రమే). మూడు సెగ్మెంట్లలో (ఇండివిడ్యువల్, బిజినెస్, పెట్రోలింగ్) ఈ బర్డ్ సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లు లభ్యమవుతాయి. ఇండివిడ్యువల్ సెగ్మెంట్లో i2 Commuter, x2 Adventure, x2 Turf అనే మోడళ్లు, బిజినెస్ సెగ్మెంట్లో i2, i2 Cargo, x2, x2 Golf అనే మోడళ్లు మరియు పెట్రోలింగ్ సెగ్మెంట్లో Segway Patroller i2, Segway Patroller x2 అనే మోడళ్లు లభ్యమవుతాయి.
* సెగ్‌వే పిటి ఛార్జింగ్ సమయం - 3 గంటలు
* సెగ్‌వే పిటి రేంజ్ - 19 కి.మీ. నుంచి. 40 కి.మీ. (మోడల్‌ను బట్టి)
* బ్యాటరీ మార్చాల్సిన సమయం - ప్రతి 20,000 కి.మీ. ఒకసారి
* ప్రారంభ ధర - రూ.4,94,890/-
బర్డ్ గ్రూప్‌కు చెందిన రీటైల్ విభాగం బర్డ్ రీటైల్ ద్వారా ఇవి మార్కెట్లో లభ్యమవుతాయి. బర్డ్ రీటైల్‌కు దేశవ్యాప్తంగా 30 అవుట్‌లెట్లు ఉన్నాయి. బర్డ్ సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు, డీలర్‌షిప్ లొకేషన్లు తదితర వివరాలం కోసం http://www.birdsegway.com/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








