పక్షులకు రోడ్ స్పీడ్ లిమిట్స్ గురించి తెలుసు; పరిశోధకులు

By Ravi

వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై మనం అనేక రకాల పక్షులను చూస్తుంటాం. ఒక్కోసారి రోడ్డుపై అడ్డంగా ఉన్న పక్షులను చూసి మనం కంగారు పడి వాహనాన్ని పక్క తిప్పడం చేస్తుంటాం. కానీ, అవి మాత్రం మన కన్నా ముందుగానే తుర్రమని ఎగిరిపోతాయి. తాజా పరిశోధనల ప్రకారం, పక్షలకు వాహనాల వేగ పరిమితికి అవగాహన ఉంటుందని తేలింది.

మనషుల నడిపే వాహనాల వేగ పరిమితి గురించి పక్షులకు అవగాహన ఉంటుందని పరిశోధకలు తేల్చి చెబుతున్నారు. అంటే, దీని అర్థం పక్షులు రోడ్డు సంకేతాలను అర్థం చేసుకుంటాయని కాదు, కానీ అవి రోడ్డుపై వాహనం ఎంత వేగంతో వెళ్తుందో అంచనా వేయగలవు.

పీర్రే లెగాగ్‌నెక్స్, సిమోన్ డ్యుకాటెజ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రోజు తమ ల్యాబ్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో పక్షల కదలికపై పరిశోధన జరిపారు. ఇలా కొద్దిరోజుల పాటు జరిపిన వారి పరిశోధనలో తేలిందేంటే, రోడ్డుపై వాహనంలో గంటకు 50 కి.మీ. వేగంతో వెళ్తున్నప్పుడు, వాహనం సుమారు 15 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఎగిరిపోయేవి.

అదే గంటకు 110 కి.మీ. వేగంతో నడిపేటప్పుడు అవి వాహనం సుమారు 75 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఎగిరిపోయేవని సదరు శాస్త్రవేత్తలు గుర్తించారు. రోడ్డుపై అందే సంకేతాలను అధారంగా చేసుకొని పక్షలు వాహన వేగాన్ని అంచనా వేసుకుంటాయని వారు గుర్తించారు.

Bird On Road

More from DriveSpark

Article Published On: Wednesday, August 28, 2013, 9:02 [IST]
English summary
Two scientists working together in France have concluded that birds can comprehend the different speed limits on roads set by humans. Before you call them crazy, we should make it clear that they are not saying that birds can actually understand road signs, but understand fairly well that cars travel faster on some roads than on others.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+