ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు మరియు టెలివిజన్ వీక్షకులకు పరిచయం అవసరం లేని పేరు బిత్తిరి స‌త్తి (రవి కుమార్). తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అటు సెలబ్రిటీలను ఇటు ప్రేక్షకులను నవ్విస్తుంటాడు మన సత్తి. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో వెరైటీగా న్యూస్‌ని హోస్ట్ చేస్తూ, తన వెటకారంతో వివిధ వ్యక్తులు, సంస్థలను రోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి కామెడీ టైమింగ్ నవ్వని వారంటూ ఎవ్వరూ ఉండరు. అమాయకంగా మాట్లాడుతూనే, ఆసక్తికర విషయాలను చెబుతుంటాడు.

ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

ఇటీవలి కాలంలో బిత్తిరి సత్తి ఇండస్ట్రీలో బాగా బిజీ అయిపోయాడు. బిత్తిరి సత్తి కామెడీ టైమింగ్‌ను మెచ్చిన సినీ ప్రముఖులు కొన్ని సినిమాలలో అవకాశాలు కూడా కల్పించారు. అంతేకాదు, బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు అనే సినిమాలో కూడా పనిచేశాడు. ఈ చిత్రంలో సత్తి పిట్టలదొర క్యారెక్టర్‌లో నవ్విస్తాడు, అదే సమయంలో తన అమాయకపు నటనతో కన్నీళ్లు తెప్పిస్తాడు. కెరీర్‌లో బాగా బిజీ అయిపోయిన బిత్తిరి సత్తి, ఇప్పుడు రెండు చేతుల్తో బాగానే సంపాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే, బిత్తిరి సత్తి ఓ ఖరీదైన రేంజ్ రోవర్ వెలార్ కారును కొనుగోలు చేశాడు.

ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

బిత్తిరి సత్తి కొనుగోలు చేసిన బ్రిటీష్ లగ్జరీ కార్ రేంజ్ రోవర్ వెలార్‌కు సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ కారును తన కుటుంబంతో కలిసి డెలివరీ తీసుకున్నారు. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). అన్ని పన్నులు మరియు ఇతర కస్టమైజేషన్లను ఏవైనా ఉంటే అన్ని కలిపి దీని ధర సుమారు కోటి రూపాయల వరకూ ఉంటుంది.

ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

బిత్తిరి సత్తి ఇంతటి ఖరీదైన కారును కొనుగోలు చేయడం చూసి అతని అభిమానులు అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు. తన కష్టానికి తగిన ఫలితం లభించిందని, ఓ కావలి కారి (VRA) కొడుకు రేంజ్ రోవర్ కారును కొనే స్థాయికి ఎదిగాడంటే దాని వెనక ఎన్ని అవమానాలు, ఎన్నికష్టాలు పడిఉంటాడో మనం ఊహించొచ్చు. కష్టపడితే ఎంత కింద స్థాయిలో ఉన్న ఉన్నత స్థానానికి ఎదగొచ్చనేదానిని బిత్తిరి సత్తి (రవికుమార్) నిరూపించారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

రేంజ్ రోవర్ వెలార్ (Range Rover Velar) విషయానికి వస్తే, టాటా మోటార్స్ అధీనంలో ఉన్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) గతేడాది జూన్ నెలలో ఇందులో కొత్త 2021 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఆర్-డైనమిక్ ఎస్ (R-Dynamic S) వేరియంట్‌లో లభిస్తుంది. వాటి ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి:

* Range Rover Velar (2.0 l Petrol R-Dynamic S) - రూ. 89.41 లక్షలు

* Range Rover Velar (2.0 l Diesel R-Dynamic S) - రూ. 89.41 లక్షలు

ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

రేంజ్ రోవర్ వెలార్‌ను మొట్టమొదటి సారిగా డిసెంబర్ 2017 ‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.78.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ఆ తర్వాత 2019లో మేడ్-ఇన్-ఇండియా వెలార్‌ను జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీలో స్థానికంగా లభించే విడిభాగాలను ఉపయోగించడం మరియు స్థానిక అసెంబ్లీ కారణంగా రెండేళ్ల క్రితం ఈ కారు ధర రూ.72.47 లక్షలుగా ఉండేది. అయితే, ఇప్పుడు ఈ కారు ధర భారీగా రూ.17 లక్షల వరకూ పెరిగిపోయింది.

ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

రేంజ్ రోవర్ వెలార్‌ లగ్జరీ ఎస్‌యూవీ 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 246 హెచ్‌పి శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 201 హెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంకా ఇందులో టార్క్-ఆన్-డిమాండ్ ఆల్ వీల్ డ్రైవ్, టెర్రైన్ రెస్పాన్స్ 2 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ కేవలం 8.20 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎస్‌యూవీ టాప్ స్పీడ్ గంటకు 210 కిలోమీటర్లు.

ఇప్పుడు బిత్తిరి సత్తి రేంజే వేరు..! కోటి రూపాయల రేంజ్ రోవర్ వెలార్ కారు కొన్న బిత్తిరి సత్తి..!!

రేంజ్ రోవర్ వెలార్‌లో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండు 10 ఇంచ్ టచ్‌స్క్రీన్‌లు (ఒకటి డ్యాష్ బోర్డులో, మరొకటి సెంటర్ కన్సోల్‌లో) రీడిజైన్డ్ ఇంటర్ఫేస్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రిమోట్, 12.3 ఇంచ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు 3డి నావిగేషన్, మెరీడియన్ సౌండ్ సిస్టమ్, 3డి సరౌండ్ కెమెరా, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్‌తో క్యాబిన్ ఎయిర్ అయోనైజేషన్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి.

Most Read Articles

English summary
Bithiri sathi buys range rover velar luxury car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X