బొగ్గు గనులలో బయల్పడిన రహస్యమైన కార్లు అవశేషాలు
దాదాపుగా 200 అడుగుల లోతులో వందలకొద్ది అత్భుతమైన కార్లు పడి ఉన్నాయి. అక్కడకు వెళ్లడం అనేది. చావుతో ముడిపడిందనే చెప్పాలి. ఏ మాత్రం గాలి వెలుతురు ప్రవేశించని చోటులో కొన్ని వందల వరకు కార్లు పడి ఉన్నాయి. ఇది ఏ హాలీవుడ్ సినిమా స్టోరి అని అనుకుంటే మీరు పొర పాటుపడినట్లే. ఇది అక్షరాల నిజం.
ఒక ఐటి ఇంజనీర్ కాలక్షేపం కోసం చేసిన యాత్రలో బయటపడిన నిజాలు ఇవి. ఆ కార్లు ఎవరివి, ఎక్కడ ఉన్నాయి, ఏ కాలం నాటి కార్లు అనే అధ్యంతం విస్మయానికి గురిచేసే మరిన్ని విశయాలు క్రింద గల స్లైడర్ ద్వారా తెలుసుకుందాం రండి.

31 సంవత్సరాల వయస్సున్న గ్రేగొరి రివొలెట్ వృత్తిరీత్యా ఐటి ఇంజనీరు. సాంకేతిక ప్రపంచానికి దూరంగా గడపాలని అనుకున్న అతని నిర్ణయం ఇక్కడ చేర్చింది.

ఇది యుకెలో లోని వేల్స్‌లో కలదు. ఒకప్పుడు ఇది బొగ్గు గని కాలక్రమేనా దీనిని మూసి వేసినట్లు తెలిసింది.

ఈ అగాథంలో గల కార్లు దాదాపుగా 1960 ల కాలం నుండి ఇలా క్రుళ్లిపోతూ ఉండవచ్చిని తెలిపాడు.

ఇది అత్యంత భయంకరమైన అగాథం మనుషులు వెళ్లడానికి ఎంతో సమయం పడుతుంది. ఇలాంటిది ఏకంగా కొన్ని వదల కార్లను ఎలా తీసుకువచ్చారనేది తనకు ఇప్పటికీ మింగుడుపడటం లేదని తెలిపాడు.

ఈ అగాథంలోకి ప్రవేశించడానికి తాడు సహాయంతో అతి భయంకరమైన చీకటి ప్రదేశంలోకి దిగుతున్న సమయంలో అడుగు ఎటు మోపినా కాలు దిగబడే విధంగా ఉంది. ఇలా 65 అడుగుల లోతు వరకు వెళ్లినట్లు తెలిపాడు.

దీనిని ఎలా గుర్తించారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ, ముందు ఈ గుహకు కొంచెం సమీపంగా వచ్చినపుడు సూర్యుని నుండి వచ్చిన కాంతి అగాథంలోకి ప్రవేశించడం వలన అతి పరావర్తనం చెందినపుడు అందులోపడి ఉన్న కార్లు కనిపించాయని తెలిపాడు

అయితే ఈ బొగ్గు గని 1830 ప్రారభించి తరువాత 1960 లో మూసివేశారు. కాని 1960 సంవత్సరం తరువాత దాదాపుగా 70 వరకు క్లాసిక్ కార్లను ఇందులో పడేశారు.

కొంత మంది వ్యక్తులు దీని గురించి స్పందిస్తూ ఇక్కడ మైనింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులు తమ కార్లను ఇలా వదిలేసి ఉంటారని తెలిపారు.ఇక్కడ గల రహదారి గుండా అగాథం వైపు వెళ్లవచ్చని తెలిపారు.

కాని ఇప్పటికీ వరకు ఇది మిస్టరీగానే మిగిలిపోనుంది. ఎందుకంటే ఇన్ని కార్లను ఇలా ఎందుకు వదిలేసి వెళ్లారు మరియు ఎందుకు ఇలా చేశారు అనే సమచారం లేదు కాబట్టి.

- జపాన్ అణు విపత్తు కాలం నాటి విస్మయపరిచే ఆనవాళ్లు
- ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?


Click it and Unblock the Notifications