ఎన్నికల ప్రచారం కోసం భాజాపా హై-టెక్ బస్
మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పటి అన్ని రాజకీయ పార్టీలు సరికొత్త ప్రచారాలకు తెరలేపుతున్నాయి. తమ ఎన్నికల ప్రచారాల కోసం ఆయా నాయకులు ఎన్నుకునే వాహనాలు చాలా విశిష్టంగా ఉంటున్నాయి.
ఇది కూడా చదవండి: నందన్ నీలేకని ఎన్నికల క్యాంపైన్ వెహికల్
ఇప్పుడు ఈ కథనంలో మనం చూడబోయేది భాజాపా (భారతీయ జనతా పార్టీ) ఎన్నికల బస్సు. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపైన్ బస్సును డిజైన్ చేయించారు. దీనిని కస్టమైజ్ చేసింది మరెవరో కాదు, ప్రముఖ డిజైన్ హౌస్ డిసి డిజైన్స్.
ఈ కమలనాధుల ఎన్నికల బస్సులోని ఆ విలాసాలేంటో మనం కూడా ఓ లుక్కేసొద్దాం రండి..!

బిజెపి ఎన్నికల ప్రచారం కోసం కస్టమైజ్ చేయించిన ఈ హై-టెక్ బస్సు పేరు 'విజయ భారత రథం'.

ఈ బస్సును కర్ణాటక మాజీ సిఎం, బెంగుళూరు నార్త్ బిజెపి అభ్యర్థి సదానంద గౌడ ఆవిష్కరించారు.

ఈ బస్సును కేవలం బిజిపి ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే ఉపయోగించనున్నారు.

విజయ భారత రథంగా పిలిచే ఈ హె-టెక్ బస్సును మాజీ పరిశ్రమల శాఖా మంత్రి మురుగేషన్ నిరానీ బహుకరించారు.

ఈ బస్సును మజ్దా సంస్థ తయారు చేసింది, దీనిని పంజాబ్ నుంచి తెప్పించారు

ప్రముఖ భారతీయ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ సంస్థ ఈ బస్సును పలు విలాసవంతమైన ఫీచర్లతో కస్టమైజ్ చేసింది. తర్వాతి స్లైడ్‌లో ఆ ఫీచర్ల వివరాలు పరిశీలించండి.

ఈ లగ్జరీ బస్సులో మొత్తం 8 మంది కూర్చోవచ్చు. ప్రచార సమయంలో బస్సు లోనుంచే ప్రజలకు అభివాదం చేసేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా హైడ్రాలిక్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు.

రోడ్ షో అయిపోయిన తర్వాత, నాయకుల వినోదం కోసం ఇందులో 2 ఎల్‌సిడి టెలివిజనలు, డిష్ టివి సెట్, ఎయిర్ కండిషనింగ్, జనరేటర్, రిఫ్రిజిరేటర్, సిసి టివి, టాయ్‌లెట్, మైక్ సెట్, మీడియ ఇంటర్వూ కోసం ప్రత్యేక విభాగం వంటి అనేక ఫీచర్లున్నాయి.

బిజెపి పార్టీ గుర్తు కమలంలోని రంగులతో ఈ బస్సును డిజైన్ చేశారు. దీనిపై ఈ సారి మోడి సర్కార్ అని రాసి ఉంటుంది.


Click it and Unblock the Notifications








