పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్య వాహనదారులకు అందకుండా ఉండే స్థాయికి చేరిపోతున్నాయి. ఈ క్రమంలో భాగంగానే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేసింది. ప్రస్తుతం భారీగా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల రోజువారీ ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ వాహనదారుల డిమాండ్ నెరవేరే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ కారణంగానే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుపై ప్రజలు నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాహదారులు నిరసనలు చేస్తున్న సమయంలో కొంతమంది బిజెపి నాయకులు వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇంధన ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేసిన వాహనదారుల ప్రశ్నలకు ఒక బిజెపి నాయకుడు ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

నివేదికల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాకు చెందిన Ramratan Payal అనే ఒక బిజెపి నాయకుడు, ఇటీవల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంధన ధరల పెరుగుదల గురించి కొందరు విలేకరులు అతడిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు కోపగించుకున్న రామ్ రతన్ పాయల్, మీకు తక్కువ ధరకే పెట్రోల్ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లండి, అక్కడ లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు లభిస్తుందని వ్యంగ్యమైన సమాధానాలు ఇచ్చారు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

ఒక అధికారిక పార్టీలో ఉన్న నాయకుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్ కోరల్లో పడి నలుగుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు వెళితే, రూ. 50 కి పెట్రోల్ పొందవచ్చు, కానీ భారతదేశం వలె సురక్షితం కాదని Ramratan Payal చేసిన ప్రకటనపై ప్రజలు స్పందించారు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

అధికార బిజెపి నాయకులు చేసిన ఈ ప్రకటన, ధరల పెరుగుదలతో బాధపడుతున్న ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేసింది. Ramratan Payal చేసిన ప్రకటన బాధ్యతారహితంగా ఉందని ప్రజలు మరియు వాహనదారులు స్పందించారు. బిజెపి నాయకులు పెట్రోల్ మరియు డీజిల్ ధరల విషయంపై మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

గతంలో కూడా చాలా మంది బిజెపి నాయకులు ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం కంటే కూడా, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిదని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల మన పొరుగు రాష్ట్రమయిన తమిళనాడులో Stalin ప్రభుత్వం, పెట్రోల్ ధరను రూ. 3 వరకు తగ్గించి ప్రజలకు కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వాహనదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. వాహనదారులు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతున్నారు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

కానీ ఈ డిమాండ్ నెరవేరుతుందా.. లేదా, అని వాహనదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు చాలా రోజులుగా పెట్రోల్ మరియు డీజిల్‌ని జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ వారి డిమాండ్ ఇంకా నెరవేరలేదు. పెట్రోల్ మరియు డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తే వాటి ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారుల డిమాండ్స్ పై ఏ మాత్రం స్పందించడం లేదు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడంతో, చాలా మంది ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని చూస్తున్నారు.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

రోజురోజుకి ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ వల్ల స్టార్టప్ కంపెనీలతో సహా అనేక కంపెనీలు దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 స్కీమ్ కింద సబ్సిడీ కూడా అందిస్తోంది.

పెట్రోల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్ళండి; బిజెపి నాయకుని ఘాటు వ్యాఖ్యలు

కేవలం కేంద్ర ప్రభుత్వమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకుపై సబ్సిడీ ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని కూడా అమలు చేశాయి. ముఖ్యంగా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల అమలులో మిగిలిన రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందుంది. రాబోయే కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడకంలోకి వస్తాయి.

Note: ఈ ఆర్టికల్లోని మొదటి రెండు ఫోటోలు మిగిలిన అన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి.

Most Read Articles

English summary
Bjp leader says to go to afghanistan to get cheap petrol details
Story first published: Saturday, August 21, 2021, 11:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X