కేజ్రీ సరి బేసి దెబ్బకు గుర్రాలు, సైకిళ్లలో వెళుతున్న బిజెపి నాయకులు
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో సరి బేసి విధానం అమలులో ఉంది. అయితే దీనికి అనుగుణంగా బిజెపి పార్టీ నాయకులు మరియు అధికారులు ఈ సరి బేసి విదానానికి ప్రత్యామ్నాయలను ఎంచుకున్నారు. సాధారణంగా కేజ్రీవాల్ ప్రవేశ పెట్టిన ఈ విధానాన్ని బిజెపి నాయకులు పెద్దగా సమర్థించలేదు. అయితే తాజాగా కొంత మంది నాయకులు దీనిని సమర్థిస్తూ విన్నూత్న దారులను ఎంచుకుంటున్నారు.

తాజాగా బిజెపి పార్టి ఎమ్‌పి అయిన పారేశ్ రావల్ సరి బేసి విధాన్ని ఉల్లఘించడకోసం సరి కార్లు వినియోగించాల్సిన రోజున బేసి కార్లను వినియోగించి రూల్‌ను ఉల్లంఘించాడు ఇందుకు గాను 2,000 రుపాయలను అతిక్రమనల క్రింది చెల్లించాడు. అలాగే బిజెపి పార్టికి చెందిన మరొక పార్లమెంట్ సభ్యుడు మనోజ్ తివారి సరిబేసి విధానం అమల్లో ఉన్న రోజున అశ్వం మీద వచ్చాడు. పైగా ఉద్గార రహిత వాహనం అనే బోర్డును కూడా ముందు వైపున అంటించుకుని పార్లమెంటుకు వెల్లాడు.
ఇదే దారిలో మరొక నేత సైకిల్ మీద సభకు చేరుకున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి ఒక నాయకుడు తీసుకున్న నిర్ణయం ఇతర నాయకులు తూచాతప్పకుండా ఎలా పాటిస్తున్నారో. ముందు నాయకులు పాటిస్తే తరువాత ప్రజలే పాటిస్తారని వీరు నిరూపించారు. అయితే ఢిల్లీ సిఎం అరంవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని ఢిల్లీ పరిధిలో వాహన కాలుష్యం కాస్త అదుపులోకి వస్తోంది.
ఎక్కువ మంది చదివిన కథనాలు మీ కోసం...
హైదరాబాద్ నుండి ఢిల్లీకి కేవలం రూ. 91 లతో ప్రయాణించవచ్చు
కొన్ని వేల కోట్ల రుపాయల ధనాన్ని కొల్లగొట్టిన మాల్యా తీరు మరియు అతని కార్ల ప్రపంచం
బెంజ్ కార్ల కోసం వేచి ఉండడు.... ఆటో రిక్షాల్లో కూడా ప్రయాణిస్తాడు: అజీమ్ ప్రేమ్‌జీ


Click it and Unblock the Notifications








