మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ ప్రమాదాల కారణంగా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠినమైన మోటార్ వాహన చట్టాన్ని అమలుచేసింది. ఈ మోటార్ వాహన చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన నియమాలను వాహనదారులు తప్పకుండా పాటించాలి. లేకుంటే తగిన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

కొత్తగా అమలులోకి వచ్చిన మోటార్ వాహన చట్టం నియమాల కింద, అత్యవసర సేవలను అందించే వాహనాలకు ఇతర వాహనదారులు అంతరాయం కలిగించకూడదు. అయితే అత్యవసర సేవలను అందించే వాహనాలకు అంతరాయం కలిగించే వాహనదారులపై ఎమర్జెన్సీ సర్వీసులపై కఠిన చర్యలు తీసుకుంటారు. గతంలో కూడా దీనికి సంబంధించిన చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

నివేదికల ప్రకారం, ఒక Toyota Innova Crysta (టయోటా ఇన్నోవా క్రిస్టా) ఒక కార్డియాలజిస్ట్‌ను ఆసుపత్రికి తీసుకువెళుతున్న అంబులెన్స్ కి దాదాపు 5 కిలోమీటర్లు అంతరాయం కలిగించినట్లు తెలిసింది. అయితే Toyota Innova Crysta యజమానిపై చర్య తీసుకోవడంలో అధికారులు నిర్లక్యం చేసినట్లు ఆరోపించబడింది.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

భారతదేశంలో ఎమర్జెన్సీ వాహనాలైన అంబులెన్స్‌లు మరియు ఫైర్ ఇంజన్లకు అంతరాయం కలిగించడం చట్ట విరుద్ధం. కానీ కేరళలోని కొల్లం జిల్లాలో ఒక అంబులెన్స్‌కి దాదాపు 5 కిలోమీటర్ల వరకు దారి ఇవ్వకుండా, అంతరాయం కలిగించిన Toyota Innova Crysta కారు డ్రైవర్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. Toyota Innova Crysta అంబులెన్స్‌కు అంతరాయం కలిగించే వీడియోను ఆసియా నెట్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

ఈ వీడియోలో మీరు గమనించినట్లైతే, ఒక తెల్లటి టయోటా ఇన్నోవా కారు మినహా అన్ని వాహనాలను అంబులెన్స్‌ వెళ్ళడానికి దారి ఇవ్వడం చూడవచ్చు. ఈ కారు అంబులెన్స్ వెళ్లాల్సిన స్థలంలో ముందుకు కదులుతోంది. ఇన్నోవా కారు డ్రైవర్ రోగి పరిస్థితిని తెలుసుకోకుండా సుమారు 5 కిలోమీటర్ల వరకు అంబులెన్స్ ని ముందుకు వెళ్లనివ్వలేదు. ఇది నిజంగా అమానుషమైన చర్య.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

అంబులెన్స్ వాహనాలకు అంతరాయం కలిగించే వారు ఎంతటి వారైనా ఖచ్చితంగా జరిమానా విధించబడుతుంది. ఈ వీడియోలోని కారు వెనుక విండో గ్లాస్ స్క్రీన్ కలిగి ఉంది. కావున కారులో ఎవరున్నారో అనేది స్పష్టంగా కనిపించదు. ఈ విధమైన స్క్రీన్ లేదా సన్ ఫిల్మ్ ఉపయోగించడం భారతదేశంలో చట్టవిరుద్ధం. కార్లలో ఇటువంటి సన్ స్క్రీన్ తొలగించాలని కోర్టులు ఇప్పటికే సంబంధిత శాఖలను ఆదేశించాయి.

ఈ వీడియోలో గమనించినట్లైతే ఈ ఇన్నోవా కారు రోడ్డు నియమాలను కూడా సరిగ్గా పాటించలేదు. ఇది రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు వెళ్లడం కూడా గమనించవచ్చు. ఈ ఇన్నోవా కారును సంబంధిత RTO కార్యాలయం బ్లాక్ లిస్ట్ చేసింది. అయితే, రవాణా శాఖ లేదా పోలీసులు డ్రైవర్‌పై ఎలాంటి కేసును నివేదించలేదు. అక్కడి అధికారులు మరింత సమాచారం అందించడానికి కూడా నిరాకరిస్తున్నారు.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

ఈ ఇన్నోవా కారు ఓనర్ ఎవరు అనే విషయాలు ఇంకా తెలియదు. మన దేశంలో ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. సంబంధిత వీడియోలు సోషల్ నెట్‌వర్కింగ్‌లో వైరల్ అయిన వెంటనే, ప్రజలకు ఇబ్బంది కలిగించే వాహనదారులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

ఈ సందర్భంలో కూడా, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి మరియు అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా హెచ్చరించాలి. అలా కాకూండా వదిలేస్తే, దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఇతర వాహణదారులు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతానికి ఇంకా ఇన్నోవా కారుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఒక సమర్థవంతమైన ప్రశ్న. మన రాష్ట్రంలోని మంగళూరులో కొన్ని నెలల క్రితం, ఒక వ్యక్తి హైవేపై Maruti Suzuki Ertiga కారును తీసుకెళ్తున్న అంబులెన్స్‌ని అడ్డుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

అప్రమత్తమైన వెంటనే, మంగళూరు పోలీసులు అంబులెన్స్‌కు అంతరాయం కలిగించిన ఎర్టిగా డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. 2019 లో అమల్లోకి వచ్చే భారతీయ మోటార్ వాహన చట్టం కింద, అత్యవసర వాహనాలకు అంతరాయం కలిగించే వాహనదారులకు రూ. 10,000 జరిమానా విధించబడుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా కొందరు అత్యవసర సేవా వాహనాలకు అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పూర్తిగా తగ్గించడానికి కేవలం జరిమానాలు మాత్రమే సరిపోవు, ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడవచ్చు.

మానవత్వం మరచిన కారు డ్రైవర్.. 5 కి.మీ అంబులెన్స్‌కు అంతరాయం[వీడియో]

రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు కూడా అత్యవసర వాహనాలను ముందుకు వెళ్ళడానికి సహకరించాలి. ఇది ప్రతి మనిషిలోని మానవత్వాన్ని తెలుపుతుంది. కావున వాహనదారులు తప్పకుండా దీనిని గుర్తుంచుకుని అమలు చేయడానికి సహకరించాలి.

Image Courtesy: asianetnews

NOTE: ఈ కథనంలో మొదటి 5 ఫోటోలు మినహా, మిగిలినవి కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Black listed innova crysta driver blocks ambulance for 5 kms video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X