Drone Delivery త్వరలో దేశవ్యాప్తంగా డ్రోన్లతో రక్తం సరఫరా..?
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ముందడుగు వేసింది. డ్రోన్ల సాయంతో బ్లాడ్ బ్యాగ్ డెలివరీ చేయడంలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. ఐడ్రోన్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ నిర్వహించింది.
త్వరలో డ్రోన్ల సాయంతో రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ చేసే విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కరోనా సమయంలో i-DRONE సాయంతో ICMR.. కొవిడ్ వ్యాక్సిన్లను మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేసింది. నేషనల్ మిషన్‌లో భాగంగా డ్రోన్ ఎకోసిస్టమ్ విస్తరణకు చొరవ చూపింది.

డ్రోన‌్ల ద్వారా రక్తాన్ని సరఫరా చేయడంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాహ్ల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాల్సిన రక్తం మరియు రక్తానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులను రవాణా చేశామని.. ఈ ట్రయల్ రన్ ద్వారా ఉష్ణోగ్రత నిర్వహణతో పాటు రక్తానికి ఎటువంటి నష్టం జరగడం లేదని గుర్తించామని వెల్లడించారు.
డ్రోన్ల ద్వారా రక్తం పంపినట్లుగానే.. ఓ శాంపిల్‌ను అంబులెన్స్‌లోనూ పంపించామని డాక్టర్ రాజీవ్ తెలిపారు. రెండు శాంపిల్స్‌లో ఏం తేడాలు గుర్తించకుంటే.. త్వరలో భారతదేశం అంతా డ్రోన్‌లను వినియోగిస్తామని ఆయన చెప్పారు.
డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగ్‌లను సరఫరా చేయడంలో సవాళ్లను గుర్తించడం మరియు అందుకు అవసరమైన స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు పరిష్కారాలను గుర్తించవచ్చని డాక్టర్ రాజీవ్ అభిప్రాయపడ్డారు.
డిజిటలైజేషన్ మరియు సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారీ మరియు వేగవంతమైన డెలివరీ మెకానిజంతో కేవలం ఒక్క సంవత్సరంలో సుమారు 90 శాతం కవరేజిని భారత్ సాధించిందని తెలిపారు. టెక్నాలజీ అభివృద్ధి.. భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్రయల్ రన్‌లో 10 యూనిట్ల రక్తాన్ని తరలించారు. గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వం మెడికల్ కాలేజీ మరియు ఢిల్లీలోనిలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ మధ్య డ్రోన్ల ద్వారా రక్తాన్ని సరఫరా చేశారు.
ప్రస్తుతం ఘనా, అమెరికా సహా కొన్ని దేశాలు డ్రోన్ల ద్వారా రక్తం మరియు వ్యాక్సిన్లు, ఔషధాలు, మెడికల్ ఉత్పత్తులను ఇప్పటికే సరఫరా చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవయవాల తరలింపునకు డ్రోన్లను కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి.
భారత్‌లో కరోనా సమయంలో డ్రోన్లతో వస్తువులను డెలివరీ చేసేందుకు కొన్ని సంస్థలు కూడా ప్రయత్నం చేశాయి. అయితే ఈ డ్రోన్ టెక్నాలజీ విస్తరణ బాగా జరిగితే అత్యంత సులువుగా డ్రోన్ల సాయంతో మారుమూల ప్రాంతాలకు వస్తువులను డెలివరీ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం సహా అవసరమైన మందులను వేగంగా డెలివరీ చేయడం వల్ల ప్రాణ నష్టం కూడా నివారించవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








