బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కరోనా మొదటి దశ కంటే చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు ఈ కరోనా భారిన పడి ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. అది మాత్రమే కాదు రోజురోజుకి లెక్కకు మించి ఈ వైరస్ ప్రభావానికి గురవుతున్నారు.

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

ఈ సమయంలో దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి పెద్ద కంపెనీలు సైతం కరోనా నివారణ కోసం పాటుపడుతున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా ఆక్సిజన్ అందించడానికి ముందుకు వచ్చాయి. అంతే కాకుండా ఇటీవల మహీంద్రా & మహీంద్రా కంపెనీ మహారాష్ట్రలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

కొంతమంది వాహన తయారీదారులు ఇటీవల ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ అనేది కరోనా వైరస్ ప్రభావానికి గురైన రోగులకు చాలా అవసరం. కావున ఆక్సిజన్ అందించడానికి కంపెనీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.

MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

ఇదిలా ఉండగా ప్రముఖ క్యాబ్ కంపెనీ బ్లూస్‌మార్ట్ ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు కొన్ని ప్రత్యేక సేవలనందించడానికి ముందుకు వచ్చింది. బ్లూస్‌మార్ట్ ఇప్పుడు దేశంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు 50% తగ్గింపును అందిస్తామని తెలిపింది.

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో ఆరోగ్య కార్యకర్తలు ముందంజలో ఉన్నారు. ఇందుకోసం ఆరోగ్య కార్యకర్తలందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఇలాంటి సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు బ్లూస్‌మార్ట్ ఈ సేవను అందించడానికి ముందుకు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం.

MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

ఈ ఆరోగ్య కార్యకర్తలలో డాక్టర్స్, మెడికల్ స్తూడెంట్స్ మరియు పారామెడికల్స్ వంటివారు ఉన్నారు. వీరందరికీ బ్లూస్‌మార్ట్ 50% తగ్గింపును అందిస్తుంది. కావున పైన తెలిపిన ఆరోగ్య కార్యకర్తలందరూ ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చు.

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లూస్‌మార్ట్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్లూస్‌మార్ట్ కంపెనీ ఉపయోగించే రెంటెడ్ వాహనాల్లో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ప్రస్తుతం చాలా ఉపయోగాలున్నాయి.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

బ్లూస్‌మార్ట్ కంపెనీ పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తోంది. తన ప్రత్యేకమైన సర్వీస్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు డిస్కౌంట్ వంటి సర్వీసులను అందిస్తుండటం ప్రశంసనీయం.

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

బ్లూస్‌మార్ట్ వంటి కొన్ని సంస్థలు ఆరోగ్య నిపుణులకు ప్రత్యేకమైన సేవలను అందిస్తున్నాయి. జెన్సోల్ గ్రూపులో భాగమైన జెన్సోల్ మొబిలిటీ 2019 లో ఢిల్లీలో బ్లూస్‌మార్ట్ పేరుతో భారతదేశ తొలి 100% స్మార్ట్ ఎలక్ట్రిక్ క్యాబ్‌లను విడుదల చేయనుంది.

MOST READ:మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?

బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువవుతున్నాయి. అయితే ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని అక్కడ ప్రభుత్వం కూడా ప్రజలను ప్రోత్సహిస్తోంది.ఈ కారణంగా ఎక్కువమంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు.

Most Read Articles

English summary
Blusmart Cab Company Offers 50 Percent Discount For Healthcare Workers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X