5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కండక్టర్, ప్రయాణికుల మధ్య చిల్లర విషయంలో వాదనలు, తగాదాలు చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు కొందరు ప్రయాణికులు వారికి రావాల్సిన చిల్లర తీసుకోకుండానే వెళ్లిపోతారు. మరికొందరైతే తమకు రావాల్సింది ఇచ్చే వరకూ వదలరు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్సులో తన టికెట్‌పై రావాల్సిన రూ. 5 చిల్లరను కండక్టర్ ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ టికెట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లతో పంచుకున్నారు. నితిన్ కృష్ణ (N_4_NITHIN) అనే ప్రయాణికుడు తన X ఖాతాలో షేర్ చేశారు. కర్ణాటకలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది.

"కండక్టర్ దగ్గర 1 రూపాయి కూడా ఛేంజ్ కూడా లేదు? నా 5 రూపాయలు పోగొట్టుకున్నాను, ఏమైనా పరిష్కారం ఉందా?" అని పోస్ట్ చేస్తూ.. నితిన్ కృష్ణ BMTC యొక్క అధికారిక X ఖాతాను కూడా ట్యాగ్ చేసి క్యాప్షన్ చేశాడు. సమాచారం మేరకు నితిన్ బీఎంటీసీ బస్సులో రాగిగుడ్డ ఆలయం నుంచి HSR డిపోకు వెళ్తున్నాడు.
నితిన్ తన టికెట్ ధర రూ.15 కావడంతో నితిన్ కండక్టర్‌కి రూ. 20 నోటు ఇచ్చాడు. కానీ ఆ కండక్టర్ 5 రూపాయల చిల్లర డబ్బులను నితిన్‌కు తిరిగి ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన నితిన్.. ఈ విధంగా కండక్టర్ చిల్లర డబ్బులు తిరిగి ఇవ్వలేదని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌కి ఇప్పటికే 72,000 పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. బస్సులో చిల్లర విషయంలో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే.. యూపీఐ ద్వారా టిక్కెట్లు చెల్లించాలని నెటిజన్లు సూచించారు. మరికొందరు జేబుల్లో చిల్లర కూడా పెట్టుకోవాలని చెబుతున్నారు. బస్సుల్లో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటున్నాయని మరికొందరు కామెంట్ చేశారు.
కాగా ఆర్టీసీ బస్సులో ఇలాంటి సంఘటనలు రోజూ వేలల్లో జరుగుతుంటాయి. కొందరు చిల్లర పోతే పోనీలే అని వదిలేసుకుంటారు. మరికొందరు మొహమాటం కొద్దీ కండక్టర్‌ను చిల్లర అడగడానికి జంకుతుంటారు. ఇంకా కొందరైతే కండక్టర్‌తో గొడవ పెట్టుకుని మరీ తమకు రావాల్సిన చిల్లరను వసూలు చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి.
ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిత్యం ఇలాంటి సమస్యలను ప్రయాణికులు ఫేస్ చేస్తూనే ఉంటారు. సాధారణంగా సిటీ బస్సుల్లో కాకుండా జిల్లా బస్సుల్లో ప్రయాణికులకు కండక్టర్లకు మిగిలిన చిల్లర ఇవ్వాల్సి వచ్చినప్పుడు.. ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులకు ఇవ్వాల్సిన చిల్లర మొత్తాన్ని నోట్ల రూపంలో ఇచ్చి పంచుకోమని చెప్పడం చూస్తుంటాం.
దీంతో సదరు ప్రయాణికులు వేరే మార్గం లేక.. బస్సు దిగాక.. చిల్లర కోసం దగ్గర్లోని ఏదో ఒక షాపులో వస్తువు కొనుక్కొని వచ్చే చిల్లరను పంచుకునేవారు. మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయని అనుకుంటున్నాం. ఏదేమైనా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. చాలా వింత సంఘటనలు వెలుగులోకి వచ్చి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








