ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

చాలామంది బైక్ రైడర్లకు బైక్ రైడింగ్స్ అంటే మహా ఇష్టం. అందులో కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి లేదా ఎత్తైన ప్రాంతాల్లో బైక్ రైడింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి రైడింగ్ వ్యామోహమున్న బైక్ రైడర్స్ ఎక్కువమంది హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్-స్పితి వ్యాలీ మార్గాన్ని ఎంచుకుంటారు.

ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

సాధారణంగా రైడింగ్ చేసేటప్పుడు రోడ్లు సజావుగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రైడింగ్ ఎంతో ఆనందంగా మరియు ఆహ్లాదంగా సాగిపోతుంది. ఆలా కాకుండా ఏదైనా బురద ప్రాంతంలో లేదా కఠినమైన రోడ్లలో ఇరుక్కుంటే మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది. బురదలో ఇరుక్కున్న బైక్ బయట రావడానికి ఎన్ని తంటాలు పడిందో ఈ ఆర్టికల్ లోని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

హిమాచల్ ప్రదేశ్ లోని హాటెస్ట్ ప్రదేశాలలో లాహాల్-స్పితి లోయ ఒకటి. ఇక్కడ లోయల గుండా ప్రయాణించడం నిజంగా ఒక మధురమైన అనుభూతి. అందుకే ఎక్కువమంది రైడర్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇంత అద్భుతమైన మరియు సాహసోపేతమైన మార్గంలో వెళుతున్నప్పుడు, ఒక లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 1250 జిఎస్ బైక్ బురదలో ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన వీడియోను పేస్ బుక్ లో లడఖ్ క్లబ్ గ్రూప్ లో శ్రీనివాస్ శ్రీ పోస్ట్ చేశారు.

ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

బిఎమ్‌డబ్ల్యూ యొక్క 1250 జిఎస్ బైక్ సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి వాహనాడ్రాయునికి అనుకూలమైన బైక్. ఎందుకంటే ఇనుమిది మంచి ఆఫ్ రోడ్ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్-స్పితి లోయలో ఎక్కువ బురద కారణంగా బిఎమ్‌డబ్ల్యూ 1250 జిఎస్ బైక్ అక్కడ ఇరుక్కున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు.

ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

ఈ లగ్జరీ బైక్ బురదలో ఇరుక్కుపోయిన కారణంగా ముందుకు వెళ్లడానికి సాధ్యం కాదు. అప్పుడు మరొక రైడర్ వచ్చి బైక్‌ను నెట్టి ముందుకు తోయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నం మొత్తం వృధా అయింది. ఎందుకంటే లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 1250 జిఎస్ భారీగా ఉన్న లగ్జరీ బైక్.

ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

అప్పుడు ఇద్దరు రైడర్స్ వచ్చి బిఎమ్‌డబ్ల్యూ బైక్ రైడర్ కి సహాయం చేస్తారు. ఆ ఇద్దరు రైడర్స్ ఈ బిఎమ్‌డబ్ల్యూ బైక్ ని నెట్టడానికి పట్టువదలకుండా శ్రమిస్తూనే ఉన్నారు. చాలా సేపు వీరి శ్రమ వల్ల మొత్తానికి ఆ బైక్ బురదలోనుంచి బయటపడుతుంది.

ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

బిఎమ్‌డబ్ల్యూ మాత్రమే కాకుండా ఆ రోడ్డులో ఇతర వాహనాలు కూడా ఇరుక్కుపోయి ఉండటం మీరు వీడియోలో చూడవచ్చు. ఇందులో బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 కూడా ఉంది. అయితే ఈ బైక్ రైడర్ ఎవరి సహాయం అవసరం లేకుండా ముందుకు సాగిపోయాడు. కొన్ని ఇతర వాహనాలు ముందుకు వెళ్లడానికి ఇబ్బంది పోతున్నట్లు తెలుస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 1250 జిఎస్ బైక్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. ఎక్కడైనా సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఇవి ఖచ్చితంగా సరిపోతాయి. కానీ ఇవి కఠిన ప్రదేశాల్లో ఇరుక్కుంటే మాత్రం బయటపడటానికి చాలా ఇబ్బంది పడవలసి వుంటుంది. దీనికి నిదర్శనమే ఈ వీడియో.

ఇద్దరు రైడర్స్ నెట్టినా ముందుకు కదలని లగ్జరీ బైక్ [వీడియో]

బిఎమ్‌డబ్ల్యూ 1250 జిఎస్ బైక్ యొక్క సీటు ఎత్తు ఎక్కువగా ఉండటం కూడా ఇలాంటి సందర్భాల్లో కొంత కష్టమే, ఈ వీడియోలో మీరు పై నుంచి కింద పడే రాళ్లను కూడా చూడవచ్చు. కొండ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు నిజంగా ప్రాణాంతకం. కావున కఠినమైన రహదారిపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Most Read Articles

English summary
BMW 1250 GS Gets Royally Stuck In Spiti. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X